Shubha Shree: తొలిసారి అతడితో బంధాన్ని రివీల్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. వాలెంటైన్స్ డే గిఫ్టు అదిరిందిగా!

బిగ్ బాస్ తెలుగు 7 గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆటతీరుతో అందరినీ మెస్మరైజ్ చేసిన వీళ్లు గ్రాండ్ ఫినాలే తర్వాత నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తమకు నచ్చిన వారితో కలిసి స్పెషల్ గా పార్టీలు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. అయితే తాజాగా శుభశ్రీ రాయగురు వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఓ అబ్బాయి చేత ప్రపోజ్ చేయించుకుంది. అతడిపై తనకున్న ప్రేమను వెల్లడించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.. సుబ్బు వెనకాలే తిరుగుతూ తనపై ప్రేమను వ్యక్త పరిచే వాడు డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ. అయితే ఆమె వెళ్లిపోవడానికి ఓ రకంగా ఆయనే కారణం అయ్యాడు. కానీ వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చాలా మంది లైక్ చేశారు. అక్కడ వీరిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోకపోయినా... తమ ప్రేమను వ్యక్త పరుచుకోకపోయినా.. ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందనే విషయం మాత్రం అందరికీ తెలిసింది. అయితే బయటకు వచ్చాకా ఓసారి గౌతమ్ కృష్ణ ఇంటికి కూడా వెళ్లింది సుబ్బు పాప.

Bigg Boss Telugu 7 Contestant Shubha Shree Rayaguru Reveal Her RelationWith Gautam krishna

ముఖ్యంగా నేను తొలిసారి మా అత్తారింటికి వెళ్తున్నానని చెబుతూ స్పెషల్ వీడియో చేసింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయనతో ఓ స్పెషల్ వీడియో చేసింది. అందులో గౌతమ్ కృష్ణను ఓ అదిరిపోయే ప్లేస్ కు తీసుకెళ్లి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. వాలెంటైన్స్ డే సందర్బంగా సుబ్బు ఇచ్చిన సర్ ప్రైజ్ కు డాక్టర్ బాబు తెగ ఎగ్జైట్ అయిపోయాడు. అలాగే ఆమె కచ్చితంగా ప్రపోజ్ చేస్తుందని కూడా భావించినట్లు కనిపించింది.

కానీ చివర్లో ఆయన శుభశ్రీకి ప్రపోజ్ చేశాడు. రింగ్ పెడుతూ.. నేను నీ తోడుగా ఉంటానంటూ ప్రపోజ్ చేశాడు. నీకు జీవితాంతం తోడుంటానని సుబ్బు చేతిలో చేయి వేసి మరీ భరోసా ఇచ్చాడు. అలాగే నువ్వు జీవితంలో ఎదుర్కునే ప్రతీ సుఖం, కష్టం వెనుక నేనుంటాననంటూ వివరించాడు. చాలా క్యూట్ గా ప్రపోజ్ చేసి చివరకు ఇధ్దరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇదంతా చూసేందుకు, వినడానికి బాగానే ఉన్నా... వీరిద్దరూ రియల్ గా ప్రేమించుకోవట్లేదు.

Bigg Boss Telugu 7 Contestant Shubha Shree Rayaguru Reveal Her RelationWith Gautam krishna

కేవలం వీడియో కోసం మాత్రమే ఇలా చేశారు. అలా అని ప్రాంక్ కాదు... కానీ నువ్వు గతంలో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కు ఎలా ప్రపోజ్ చేశావు, ఏమని ప్రపోజ్ చేశావో చెప్పు... అలాగే నాకిప్పుడు, నేనే ఆమె అనుకుని ప్రపోజ్ చేయు అంటూ వివరించాడు. మీరు కూడా ఓసారి వీరిద్దరి వీడియోను చూసి ఏమనిపించిందో కామెంట్ల రూపంలో వెల్లడించండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X