Bigg Boss Telugu 7 Finale: బిగ్‌బాస్ బ్యూటీకి పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఛాన్స్.. ఆ అంతగత్తె ఎవరో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ షో ఫినాలే రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో ఈ సీజన్ విన్నర్, రన్నరప్ లు ఎవరో తెలిసిపోతారు. అయితే ఈ రోజుటి గ్రాండ్ ఫినాలేను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ముందుగా స్టేజీపైకి అదిరిపోయే డ్యాన్స్ తో వచ్చిన నాగార్జున.. ఆ తర్వాత హౌస్ లోని పాత కంటెస్టెంట్ల ను స్టేజీపైకి పిలిచారు. ఇలా ఒక్కొక్కరూ డ్యాన్స్ లు చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా అశ్విని శ్రీ, పూజా మూర్తి, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, శోభాశెట్టి, నయని పావని, సందీప్ మాస్టర్, భోలె షవాళిలు అదిరిపోయే పాటలకు స్టెప్పులు వేసి అలరించారు.
ఇక ఆ తర్వాత నాగార్జున అందిరనీ టాప్ 6 కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ తో పాటే కూర్చోబెట్టారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ కు ముందు ఎలా ఉంది, బిగ్ బాస్ తర్వాత ఎలా ఉందంటూ కంటెస్టెంట్లను అడిగారు. అయితే శుభ శ్రీ వంతు రాగానే చాలా హ్యాపీగా ఫీలవుతూ చెప్పుకొచ్చింది. తక్కువ కాలం ఇంట్లో ఉండడం వల్ల కాస్త ఫీల్ అయ్యానని... ఇంకా కొంత కాలం ఉంటే బాగుండేదని తన మనసులోని మాట చెప్పుకొచ్చింది. అది మాత్రమే కాకుండా తాను బయటకు వెళ్లినప్పటి నుంచి చాలా మంది గుర్తు పడుతున్నారని తెలిపింది.

ముఖ్యంగా మనోభావాల్ పాప అంటూ అంతా గుర్తు పడుతూ.... దగ్గరకు వచ్చి సెల్ఫీలు అడుగుతున్నారని వివరించింది. అందరూ మీరు నా మనోభావాల్ దెబ్బతిన్నాయ్ డైలాగ్ చాలా బాగా చెప్పారని ఎంతో మంది ప్రశంసలు కురిపించారని పేర్కొంది. ముఖ్యంగా తనకు గౌతమ్ కు మధ్య బాండింగ్ చాలా బాగా కుదిరిందని, నచ్చిందని కూడా ఎంతో మంది తెలిపారని అన్నారు. అంతే కాకుండా టాలీవుడ్ కు చెందిన ఓ టాప్ హీరో సినిమాలో తనకు అవకాశం దక్కిందని పేర్కొంది. అది కూడా మంచి క్యారెక్టర్ అని.. అందరికీ షాకిచ్చే వార్త చెప్పేసింది.
ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి వెళ్లాకా.. పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న ఓజీ సినిమాలో తనకు అవకాశం ఇచ్చారని చెప్పింది. పవన్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం బిగ్ బాస్ మాత్రేనని.. అది కూడా మంచి క్యారెక్టర్ అని పేర్కొన్నారు. ఇది చెప్పగానే అంతా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ అంటే ఆమాత్రం ఉంది మరి. నా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయ్ డైలాగ్ తో ఫుల్ వైరల్ అయిన ఈ ముద్దుగుమ్మను మనం త్వరలోనే ఓజీ సినిమాలో చూసేయచ్చు ఇక.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న సినిమానే ఓజీ. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అదిస్తుండగా... ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించబోతున్నారు. అలాగే అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డిలు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సుబ్బు అలియాస్ శభశ్రీ కూడా ఈ సినిమా ఆఫర్ కొట్టేయడంతో ఆమె పేరు కూడా నటీనటీలు లిస్టులో చేరిపోయింది.


Click it and Unblock the Notifications











