Shubha Shree: ఇండియా వదిలెళ్లిపోయిన శుభశ్రీ.. గౌతమ్ కృష్ణకు హ్యాండేనా?

బిగ్ బాస్ తెలుగు 7 షోలో పాల్గొని రచ్చ చేసిన మనోభావాలు పాప, లాయర్ పాప... శుభశ్రీ రాయగురు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన మంచితనం... అమాయకత్వం కలగలిపిన ఈమె... ఏంటి మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ క్యూట్ అడిగి తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇండియాను వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆమె వీడియో చూస్తే ఈమె ఇక మీదట ఇండియా రాదేమో అనిపిస్తుంది. మరి ఈమె ఎక్కడికి వెళ్లింది, డాక్టర్ బాబు పరిస్థితి ఏంటి, వీరిద్దరికీ బ్రేకప్ యేనా మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఎప్పుడూ.. శుభశ్రీ రాయగురు వెనకాలే తిరిగే వాడు. ఆమెపై ప్రేమను చూపిస్తూ... వారిద్దరి మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ ఉందన్నట్లుగానే వ్యవహరించేవాడు. అలా అని పిచ్చి పిచ్చిగా, ఆమెకు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకునే వాడు. కానీ సుబ్బు కోసం తన లెటర్ ను త్యాగం చేయలేకపోయాడు. అలాగే ఆమె వెళ్లిపోవడానికి ఓ రకంగా ఆయనే కారణం అయ్యాడు. కానీ బిగ్ బాస్ నుంచి ఆయన వచ్చాకా ముందుగా ఆమెనే కలిసి తన ప్రేమను చూపించాడు. సారీ కూడా చెప్పాడు.

Bigg Boss Telugu 7 Contestant Shubha Sree Rayaguru Lfet India Check Details

ఆ తర్వాత నుంచి వీరిద్దరూ చాలా సార్లే కలుసుకున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె అతడికి స్పెషల్ ట్రీట్ ఇవ్వడం, ప్రపోజ్ చేయించుకోవడం కూడా చూపించారు. కానీ తమ మధ్య రిలేషన్ లేదంటూనే చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా శుభశ్రీ రాయగురు ఇండియా వదిలి వెళ్లిపోతున్నానంటూ ఓ వీడియో చేసింది. దాన్ని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. థంబ్ నెయిల్ పై ఆమె ఇండియా వదిలి వెళ్లిపోతున్నా అని పెట్టగా.. అంతా ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ సెటిల్ కాబోతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మళ్లీ తిరిగి ఇండియా రావా.. మరి నీ వెనకాలే తిరిగిన డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ పరిస్థితి ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కేవలం థంబ్ నెయిల్ చూసిన వాళ్లు మాత్రమే ఇలా అడుగుతుండగా.. పూర్తిగా వీడియో చూసిన వాళ్లకు మాత్రం దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అయితే ఆమె ఇండియా వదిలి వెళ్లిన మాట వాస్తవమే అయినా.. త్వరలోనే మళ్లీ ఇక్కడకు వస్తానని చెప్పింది. తన అక్క, బావ, వాళ్ల కొడుకుతో కలిసి శుభశ్రీ సింగపూర్ వెళ్లింది. ముఖ్యంగా తన అక్క కొడుకుతో కలిసి చాలా సందడి చేసింది.

Bigg Boss Telugu 7 Contestant Shubha Sree Rayaguru Lfet India Check Details

తనకు ఔట్ ఫిట్లతో పాటు తన సింగపూర్ లో తిరిగిన ప్లేస్ లను కూడా చక్కగా చూపించింది. మొదటి రోజు అక్కడ ఎక్కడెక్కడికి వెళ్లింది, ఎలా వెళ్లింది, ఎంతగా ఎంజాయ్ చేసింది వంటి వాటన్నిటినీ చూపించింది. అయితే ఈ వీడియోను చివరి వరకు చూసిన చాలా మంది గౌతమ్ ను కూడా తీసుకు వెళ్లాల్సింది... బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి శుభశ్రీ రాయగురు సింగపూర్ వీడియో చూస్తే మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X