శివాజికి రెండో భార్య.. ఆమెతోనే కూతురు.. అసలు విషయాలు చెప్పి షాకిచ్చిన హీరో!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సీజన్ లో కంటెస్టెంట్లుగా వచ్చిన అందరి గురించి తెలుగు ప్రేక్షకులు బాగా తెలుసుకుంటున్నారు. కేవలం కంటెస్టెంట్లు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నారు.
అలా ఇంటర్వ్యూలు ఇవ్వని వారి కుటుంబాల గురించి వారికి తెలిసిన వారి వద్ద ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అయితే శివాజి బిగ్ బాస్ హౌస్ లో ఉండగా నటుడు సమీర్.. శివాజి గురించి మాట్లాడాడు. ఆయనకు ఇద్దరు మాత్రమే కాదు ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారు. ఈవార్తలపై శివాజి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా తనకు కూతురు ఉందా లేదా అన్నదానిపై షాకింగ్ న్యూస్ చెప్పారు.

బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న శివాజికి ఇద్దరు పిల్లలు మాత్రమే అని అందరికీ తెలుసు. ముఖ్యంగా వారిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. పదో వారంలో ఫ్యామిలీ వీక్ లో భాగంగా పెద్ద కుమారుడు వెంకట్ వచ్చాడు. డాక్టర్ లా వచ్చి అందరికీ షాకిచ్చాడు. అదే వారం బిగ్ బాస్ స్టేజీపైకి చిన్న కుమారుడు వచ్చాడు. తన తల్లితో కలిసి వచ్చి హౌస్ లోని అందరిపై పంచులు వేశాడు. ఇలా ఇద్దరు కుమారులతో పాటు శివాజికి అందమైన భార్య ఉందని అందరికీ తెలిసిపోయింది. అయితే వాస్తవానికి శివాజికి ఇద్దరు పిల్లలు కాదని... మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారని.. శివాజి క్లోజ్ ఫ్రెండ్, టాలీవుడ్ నటుడు సమీర్ యే చెప్పుకొచ్చారు.
శివాజికి నిజంగా ఓ కూతురు ఉందని.. ఆమె తప్పు చేసినా శివాజి అలాగే బిహేవ్ చేసేవాడంటూ శోభాశెట్టిని ఉద్దేశించి మాట్లాడాడు. అంతలోనే యాంకర్ ఏంటి శివాజి గారికి కూతురు ఉన్నారా అని అడగ్గా.. అవును ఉందంటూ పదే పదే చెప్పాడు సమీర్. ఇలా శివాజికి కూతురు ఉందనే విషయాన్ని సమీర్ తొలిసారిగా బయట పెట్టారు. అయితే శివాజికి ఓ కూతురు కూడా ఉందని సమీర్ చెప్పడంతో శివాజి కూతురు గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆమె పేరు, ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు చాలానే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అవేవీ ఫలించలేవు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజి సమీర్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందించాడు. తనకు రెండో భార్య లేదని, ముగ్గురు పిల్లలు కూడా లేరని కుండ బద్ధలు కొట్టినట్లు వివరించారు. తనకు ఒకే భార్య, ఇద్దరు కొడుకులు మాత్రమే ఉన్నారని.. నిజంగానే కూతురు ఉంటే ఈ పాటికి అందరికీ తెలిసేదని చెప్పుకొచ్చారు. అయితే సమీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే తనకే షాకింగ్ గా ఉందని అన్నాడు. కావాలనే ఎవరైనా అలా చెప్పించారేమో... తనకు వ్యూస్ వచ్చేందులు అతడితో ఇలా చేయించారేమే అంటూ వ్యాఖ్యానించారు.
వాస్తవానికి శివాజికి అసలు కూతురే లేదట. తొలిసారి తన కుటుంబ సభ్యులపై క్లారిటీ ఇచ్చారు. తన తల్లిదండ్రులతో పాటు భార్యా, పిల్లల గురించి వివరించారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది అభిమానులు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే ఇప్పటికైనా నిజం వెలుగులోకి రావడం సంతోషంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











