Tasty Teja ఇదేంటి టేస్టీ తేజ.. మీడియా అంటే అంత చులకనా?

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ ఫుడ్ వ్లాగర్‌గా అందరికి సుపరిచితులు. ఇంటిలోకి వెళ్లిన తర్వాత తనదైన శైలిలో ఆట ఆడుతూ.. దాదాపు 9 వారాల పాటు ఎంటర్‌టైనర్‌గా నిలిచాడు. అయితే అనూహ్యమైన రితీలో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన ఆయన తీరు, ప్రవర్తన మీడియాకు, స్నేహితులు, సన్నిహితులకు ఇబ్బందికరంగా తయారైందనే విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. మీడియాతో అతడు వ్యవహరిస్తున్న తీరు విషయానికి వస్తే..

Bigg Boss Telugu 7 Contestant Tasty Tejas objectionable behaviour towards media

య్యూటుబర్‌గా టేస్టీ తేజ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో ఆయన సన్నిహితులు, మీడియా వర్గాలు హ్యాపీగా ఫీలయ్యాయి. అయితే బిగ్‌బాస్ నుంచి అనుకోకుండా వచ్చిన క్రేజ్‌తో ప్రస్తుతం మీడియా, యూట్యూబ్ వారిని కించపరిచే విధంగా మాట్లాడుతుండటం వివాదంగా మారింది.

Bigg Boss Telugu 7 Contestant Tasty Tejas objectionable behaviour towards media

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు తీయడం వివాదాస్పదమైంది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ర్యాలీలు, బహిరంగ సభలు, టపాసులు పేల్చడంపై పోలీసులు ఆంక్షలు విధించారు. వాటిని పట్టించుకోకుండా టేస్టీ తేజ బాంబులు కాల్చుతూ ఆ ప్రాంతంలోని వారిని అర్ధరాత్రి అసౌకర్యానికి గురిచేశాడనేది ఓ వాదన.

టేస్టీ తేజను ఊరేగింపుగా తీసుకొచ్చిన స్నేహితులు కొందరు మద్యం సేవించి రోడ్డుపై నానా హంగామా చేయడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వచ్చి రోడ్డుపై ఏం జరుగుతుందని తెలుసుకొని.. వారిని అక్కడి నుంచి పంపించారని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు.

Bigg Boss Telugu 7 Contestant Tasty Tejas objectionable behaviour towards media

ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ తెలుగు 7 షోలోకి వెళ్తున్న సమయంలో మీడియా వర్గాలను సపోర్ట్ చేయాలని కోరిన ఆయన ప్రస్తుతం ముఖం చాటేస్తున్నాడు. మీడియా వారిపై మండిపడుతూ కించపరుస్తున్నాడు. ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పి రోజంతా వారిని విసిగించి చివరకు మాట్లాడుకుండా తిరిగి పంపిచడమే కాకుండా అసభ్య పదజాలం కూడా వాడుతుండటం వివాదంగా మారింది. అయితే బిగ్‌బాస్ నుంచి వస్తే పెద్ద గొప్పనా? పై నుంచి ఊడిపడలేదుగా అంటూ సన్నిహితులు, మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X