Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఇంట్లో ఉండే కంటెస్టెంట్స్ ఓటు ఎలా వేస్తారో తెలుసా?
ఇప్పుడంతా తెలంగాణలో ఓట్ల పండగ నడుస్తుంది. ఇక ఓటింగ్ వేసే సమయం కూడా ముగిసింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎలా ఓటు వేస్తారు. అందులోనూ తెలంగాణకు సంబంధించిన కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి వారు తమ ఓటు హక్కును ఎలా ఉపయోగించుకుంటారు. ఈ డౌట్ మీకు వచ్చి ఉంటుంది. అయితే తెలంగాణలో ఉండే ఎవరు అయినా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే. వీరు కూడా తమ ఓటును ఉపయోగించుకుంటారు. ఎలానో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణలో ఓట్ల పండుగ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమాప్తం అయింది. ఇక ఊరు వాడ అంతా కలిసి ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు జనం పొటేత్తారు. సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు తమ ఓటు హక్కను ఉపయోగించుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, నాని, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య, రామ్ చరణ్... ఇలా చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎలా ఓటు వేస్తారు అనే డౌట్ చాలా మందికి రావొచ్చు. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.. వారిలో చాలా మందికి తెలంగాణలోనే ఓటు ఉంది. దీంతో వారు ఓటు వేయరా.. వేస్తే ఎలా వేస్తారు.. ఎప్పుడు వేస్తారు.. బయటకు వచ్చి వేసి వెళ్తారా అనే డౌట్ రావొచ్చు. అయితే వారు కూడా ఓటు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలుస్తోంది.
అయితే బిగ్ బాస్ తెలుగు హౌస్టుగా చేస్తున్న నాగార్జున ఓటు వేశారు. జుబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 45 ఉమెన్స్ హాస్టల్ లో ఓటును వినియోగించుకున్నారు. మరి హౌస్ లో ఉన్న 8 మంది ఎలా వేస్తారు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఓసారి వారిలో ఎంత మంది తెలుగాణకు చెందిన వారో గమినిస్తే.. ఇద్దరే ఇద్దరు తెలంగాణకు చెందిన వారని తెలుస్తోంది. అయిన ప్రతి ఒక్కరు ఓటు ఉపయోగించుకోవాల్సిందే. అది పౌరుడిగా మన బాధ్యత.
ప్రసుతం బిగ్ బాస్ హౌస్‌లో శివాజీ, అమర్ దీప్, అర్జున్, శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్, యావర్, ప్రశాంత్ అని ఇలా 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో తెలంగాణకి సంబంధించిన వాళ్లు ఇద్దరు ఉన్నారు. ఒకరు గౌతమ్, మరొకరు ప్రశాంత్. ప్రశాంత్ ది సిద్దిపేట జిల్లా కాగా.. గౌతమ్ ది సూర్య పేట. ఇక యావర్‌ది కలకత్తా అని తెలుస్తోంది. తెలుగు సీరియల్స్ చేస్తున్న అతనికి తెలుగే సరిగ్గా రాదనే విషయం తెలిసిందే.

ఇక శోభాశెట్టి, ప్రియాంకలు కర్ణాటక అని తెలుస్తోంది. ప్రియాంక జైన్ రాజస్థాన్ అయినప్పటికీ... కర్ణాటకలో సెటిల్ అయింది. కాబట్టి వీళ్లిద్దరికీ తెలంగాణలో ఓటు హక్కు లేకపోవచ్చు. మిగిలిన ముగ్గురూ శివాజీ, అమర్ దీప్, అర్జున్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్లు. శివాజీ గుంటూరు కాగా.. అమర్ దీప్ అనంతపురం, అర్జున్ విజయవాడకు చెందినవాడు. సో వీళ్లు కూడా ఓటు వేయకపోవచ్చు.
తెలంగాణ ఎన్నికలకు ఓటు హక్కును వేయాల్సింది గౌతమ్, ప్రశాంత్. అయితే వీరి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. బ్యాలెట్ ఓటు హక్కు కల్పించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ న్యూస్ వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











