Yawar: ఆ అమ్మాయితో యావర్ రొమాన్స్... బయటపడ్డ వీడియో!
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో... ఉల్టా పుల్టా అంటూ సాగింది. అయితే గ్రాంఢ్ ఫినాలే జరుపుకున్న రోజు నుంచి మరింత నెగిటివిటీ మూటగట్టుకుంది. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన తర్వాత చెలరేగిన అల్లరులు, దాడుల వల్లే.. బయట నెగిటివిటీ వచ్చేసింది. ఇక ఆ విషయం పక్కన పెడితే... బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా యావర్.. ఫైనల్ లో నాలుగవ స్థానంలో నిలిచాడు. అయితే యావర్ ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో.. ఈ సారి బాగానే ఆకట్టుకున్నప్పటికీ నెగిటివిటీ మూటగట్టుకుంది. ఈసారి విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. అంతా బాగానే ఉన్నా... పల్లవి ప్రశాంత్ అభిమానులు అని చెప్పబడుతున్న కొంత మంది బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ల కార్లపై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సంచలనం రేపింది. అంతే కాదు.. పల్లవి ప్రశాంత్, అతని ఫ్యాన్స్ పై, బిగ్ బాస్ షో పై కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇక ఈ విషయంలో టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి.. ఇటీవల బెయిల్ మీద వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ హౌస్ లో మోడల్ గా ఎంట్రీ.. మెప్పించాడు ప్రిన్స్ యావర్. మొదటి నుంచి తన ఆటతో మెప్పించిన ప్రిన్స్ యావర్... తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అగ్రెసివ్ గా మారేేవాడు.

బిగ్ బాస్ తెలుగు 7 ఫైనాలిస్టుల్లో ప్రిన్స్ యావర్ ఒకడిగా నిలిచాడు. ఇక అతను టాప్ 4లో నిలిచి... 15లక్షల సూట్ కేసుతో బయటకు వచ్చేశాడు. దీంతో అతని నిర్ణయంపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే... యావర్.. మరో లేడీ బిగ్ బాస్ కంటెస్టెంట్ రొమాన్స్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టంట వైరల్ గా మారింది.
ఆమె ఎవరో కాదు.. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పవని. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అయిన నయని పవని.. ఉన్నది ఒక్క వారమే అయినా.. నెటిజన్స్ ను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ భామ 5వ వారంలో ఎంటర్ అయి.. 6వ వారంలో ఎలిమినేట్ అయింది. అయితే ఉన్న వారం అయినా.. యావర్, నయని పవని పెయిర్ ను చూసి చాలా మంది మరో లవ్ ట్రాక్ ఉంటుందని అనుకున్నారు.
కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ ఆమెను ఎలిమినేట్ చేశాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా మీట్ అయిన సంగతి తెలిసిందే. వీరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ నయని పావని తో చేసిన రొమాంటిక్ రీల్ సోషల్ మీడిాయలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన చాలామంది జనాలు నయని గనుక ఇంకో వారం రోజులు ఉంటే కచ్చితంగా నయని, యావర్ ఇద్దరు ప్రేమలో పడిపోయి ఉండేవారంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











