Bigg Boss Telugu 7 బిగ్​బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ వివరాలు.. శివాజీకి టాప్.. ఒక్కొక్కరికి ఎన్ని లక్షలంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎట్టకేలకు ప్రారంభం అయి.. మొదటి ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సీజన్ ఆదివారం సెప్టెంబర్ 3న ఘనంగా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో దాదాపు 22 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారంటూ వార్తలు వచ్చాయి. కానీ చివరకు 14 మంది హౌజ్ లోకి అడుగు పెట్టారు. ఆ 14 మందిలో ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు... ఎవరికి ఎక్కువ... ఎవరు తక్కువ తీసుకుంటున్నారనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలుగులో ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్... ఇప్పుడు ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ షో ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కాగా... 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పటికే వారి మధ్య చిచ్చు పెట్టేందుకు బిగ్ బాస్ సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు.. హౌజ్ లో ఉండే కంటెస్టెంట్స్ కు నరకం చూపిస్తున్నాడు. పడుకోవడానికి అనుమతి లేకుండా... దుప్పట్లు ఇవ్వకుండా వారితో ఓ ఆట ఆడుకుంటున్నాడు బిగ్ బాస్.

Bigg Boss Telugu 7 Contestants Remuneration Details Here

ఆ విషయం పక్కన పెడితే... బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయిన 14 మంది రెమ్యూనరేషన్స్ బయటకు వచ్చాయి. అందులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటుంది మాత్రం నటుడు శివాజీ అని తేలింది. అతి తక్కువగా తీసుకుంటుంది మాత్రం రైతు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో వీరు ఇద్దరిలో ఒకరు హై, ఒకరు లో పేమెంట్ తీసుకుంటున్నారు.

Bigg Boss Telugu 7 Contestants Remuneration Details Here

నటుడు శివాజీ వారానికి రూ.4 లక్షలు తీసుకుంటుండగా... శృంగార తార షకీలా రూ.3.5 లక్షలు తీసుకుంటుంది. ఇక కిరణ్ రాథోడ్ వారానికి రూ.3 లక్షలు, ఆట సందీప్ వారానికి రూ.2.75 లక్షలు, ప్రియాంక జైన్ (జానకి కలగనలేదు ఫేం) వారానికి రూ.2.5 లక్షలు, దామినీ భట్ల (సింగర్) వారానికి రూ.2 లక్షలు, రతికా రోజ్ (నేను స్టూడెంట్ సర్ ఫేం) రూ. 2 లక్షలు తీసుకుంటున్నారు

Bigg Boss Telugu 7 Contestants Remuneration Details Here

ఇక కార్తీకా దీపం సీరియల్ ఫేం శోభా శెట్టి వారానికి రూ. 2.25 లక్షలు తీసుకుంటుండగా... పల్లవి ప్రశాంత్ ఒక లక్ష మాత్రమే తీసుకుంటున్నాడు. ఇక టెస్టీ తేడ వారానికి రూ. 1.5 లక్షలు తీసుకుంటుండగా... శుభ శ్రీ (అమిగోస్ ఫేం) రూ. 2 లక్షలు తీసుకుంటుంది. గౌతమ్ కృష్ణ ( డాక్టర్) వారానికి రూ.1.75 లక్షలు తీసుకుంటున్నాడు.

Bigg Boss Telugu 7 Contestants Remuneration Details Here

మోడల్, నటుడు ప్రిన్స్ యావర్ వారానికి రూ.1.5 లక్షలు తీసుకుంటున్నాడు. ఇక జానకి కలగనలేదు ఫేం అమర్ దీమ్ వారానికి రూ.2.25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక వీరి రెమ్యూనరేషన్ వివరాలు ఇలా ఉండగా... వీరిలో ప్రియాంక జైన్, శివాజీ, ప్రిన్స్ యావర్, దామినీ, శుభ శ్రీలకు బిగ్ బాస్ మొదట్లోనే 35 లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చిన వెళ్లకుండా ఇక్కడే ఉంటామని చెప్పారు. ప్రస్తుతం వీరి రెమ్యూనరేషన్ డీటైల్స్ బయటకు రావడంతో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X