రోడ్డుపై టేస్టీ తేజ, శోభాశెట్టిల రచ్చ.. పోలీసుల రాకతో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అలా జంప్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరు, కామెడీ, ఎమోషన్స్... ఇలా అన్నింటినీ చూపిస్తూ తెగ రచ్చ చేశారు కంటెస్టెంట్లు. అయితే బయటకు వచ్చిన తర్వాత మరింత చెలరేగిపోతున్నారు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ తమ అనికిని చాటుకుంటున్నారు. అయితే తాజాగా టేస్టీ తేజ, శోభాశెట్టిలు కలిసి కారులో వెళ్తుండగా.. ఓ బైక్ ను ఢీకొట్టారు. ఆ తర్వాత వారితో తీవ్ర వాదన పెట్టుకోగా.. పోలీసులు రాగానే అలా జంప్ అయ్యారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

టేస్టీ తేజ, శోభాశెట్టిలకు.. బిగ్ బాస్ హౌస్ లోనే మంచి స్నేహం ఏర్పడింది. ముందు నుంచి వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. శోభా, తేజ అనే స్థాయి నుంచి పోరా, పోవే అనే స్థాయి వరకూ వచ్చారు. ఒకరితో చాలా క్లోజ్ గా ఉంటూ తెగ రచ్చ చేశారు. తేజ అయితే శోభాశెట్టితో పులిహోర కలుపుతున్నట్లు కనిపిస్తూనే స్నేహం అని కవర్ చేసేవాడు. ఆమెకు పళ్లు తోమించడం దగ్గర నుంచి తినిపించడం వరకూ అన్నీ చేశాడు. ఇక ఆ తర్వాత టేస్టీ తేజ హౌస్ నుంచి వెళ్లిపోతుంటే శోభా చాలా ఎమోషనల్ అయింది.

Bigg Boss Telugu 7 Contestants Tasty Teja And Shobha Shettys Car Hit The Bike Check Details

నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే.. నేను అసలు ఇక్కడ ఉండగలనా లేదా అనే భయం వేస్తుందిరా అంటూ గుక్కపెట్టి ఏడ్చింది. కానీ ఆయన హౌస్ లోంచి వెళ్లాకా పెద్దగా ఏమీ మాట్లాడలేదు. కానీ బయటకు వచ్చాకా మాత్రం అతడితోనే చాలా సార్లే కనిపిస్తూ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి షాపింగ్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈక్రమంలోనే తేజ, శోభా ఓకారులో బయలు దేరారు. ఫుల్ గా షాపింగ్ చేశారు. కడుపునిండా భోజనం కూడా చేశారు. ఇలా డే అంతా చాలా హాయిగా గడిపిన వీరిద్దరూ ఆ తర్వాత ఇంటికి బయలు దేరారు.

ఈక్రమంలోనే టేస్టీ తేజ నేను కారు నడుపుతానని చెప్పడంతో... శోభా అతిడికి డ్రైవింగ్ ఇచ్చింది. ఆయన నడపడం చూసి కాస్త భయపడుతూనే.. ఒరేయ్ నీకు డ్రైవింగ్ వచ్చా అంటూ అడిగింది. అయితే వచ్చని చెబుతూనే... నేరుగా వెళ్లి ఓ బైక్ ను ఢీకొట్టాడు టేస్టీ తేజ. అయితే అప్పటికే ఆ బైక్ ఆగి ఉండడం వారికి చాలా ప్లస్ అయింది. కానీ రాయన్ ఎన్ ఫీల్డ్ బైక్ ను వెనక నుంచి ఢీకొట్టడంతో బ్యాక్ లైట్ పగిలింది. వీరి కారుకు కూడా గీతలు పడ్డాయి. అయితే తమ బైక్ ను ఢీకొట్టిన విషయం గుర్తించిన బైకర్స్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు.

ఏంటండి అసలు.. మీకు డ్రైవింగ్ వచ్చా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా... అసలు రూల్స్ తెలుసా అంటూ టేస్టీ తేజను గట్టిగా కడిగిపారేశారు. మాకూ తెలుసు మీరు రాంగ్ రూట్ లో బైక్ ఎందుకు పార్క్ చేశారని అడగ్గా.. మేము కరెక్టుగానే పార్క్ చేశాం.. మీరే కావాలని వచ్చి మా బండిని ఢీకొట్టారంటూ మరింత గొడవకు దిగారు. ఇద్దరి మధ్య గట్టిగా వాదోపవాదనలు జరగ్గా... శోభాశెట్టి మాత్రం భయంతో గజగజా వణికిపోయింది. తేజ మాత్రం మా కారు కూడా డామేజ్ అయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇంతోలనే పోలీసులు కారు వస్తున్న శబ్దం వినిపించింది.

దీంతో బాగా భయపడిపోయిన శోభాశెట్టి, టేస్టీ తేజలు.. ఏదో ఒకటి చెయ్యండి.. పోలీసులు వస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. గొడవ వద్దు.. ఏమీ జరగలేదని చెప్పండంటూ ఆ వాహన దారులను బతిమాలారు. ఎట్టకేలకు వారికి సారీ చెప్పి.. పోలీసులు రాకముందే టేస్టీ తేజ, శోభాశెట్టిలు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే దీన్నంతా తన వ్లాగ్స్ లో పోస్ట్ చేసింది శోభాశెట్టి. మీరు కూడా ఓసారి చూస్తే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X