Bigg Boss Telugu 7: సంచాలక్‌గా సందీప్ ఫెయిల్.. ఆ బ్యాచ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి దాదాపు మూడు వారాలు కావొస్తుంది. ఇక ఈ సీజన్ మొదటి రోజు నుంచి ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే నాగార్జున వస్తాడు.. ఒక్కక్కొరికి ఇచ్చి పడేస్తాడు. ఇక ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో నాగార్జున ఒక్కోక్కరికి ఇచ్చి పడేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ ప్రారంభం అయింది. 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా... ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. షకీలా, కిరణ్ రాథోడ్ గత రెండు వారాల్లో ఎలిమినేట్ అవ్వగా.. ఈ సారి దామిని ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో రిలీజ్ అయింది.

Bigg Boss Telugu 7 Day 20 Promo Nagarjuna Angry on Aata Sandeep

ప్రోమోలో ముందుగా అమర్‌ దీప్‌ కు క్లాస్ ఇచ్చాడు నాగార్జున. ప్రియాంక జైన్‌ ను లేపి అమర్ కంటెండర్ కాకూడదనడానికి నువ్వు చెప్పిన కారణం ఏంటని నాగార్జున అడిగాడు. కంటెండర్‌ గా నాకు ఒకసారి అవకాశం వచ్చింది.. అలానే అమర్‌కి వచ్చింది.. ఇద్దరం ఫెయిలయ్యామంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. దీంతో అమర్‌ దీప్ నువ్వు అగ్రి అయ్యావా అని నాగ్ అడిగితే తల అడ్డంగా ఊపుతాడు. మరి నీ పాయింట్ నువ్వెందుకు చెప్పుకోలేదు అని అడుగుతాడు నాగార్జున.

Bigg Boss Telugu 7 Day 20 Promo Nagarjuna Angry on Aata Sandeep

ఇక అమర్ దీప్ నువ్వు నీకోసం ఆడుతున్నావా లేక ప్రియాంక కోసం ఆడుతున్నావా అంటూ ఫైర్ అయ్యాడు నాగార్జున. ఆ తర్వాత శోభా శెట్టికి సైతం తనదైన శైలీలో నాగార్జున ఇచ్చిపడేశాడు. వీకెస్ట్ క్యాండెట్‌ ను ఎలిమినేట్ చేయమన్నారు.. నువ్వేం చేశావ్ అని అడగ్గా... సార్ నేను వీకెస్ట్ అని చెప్పలేదు అంటూ శోభా చెప్పుకువచ్చింది. యవర్ స్ట్రాంగ్ కాబట్టి తనని ఎలిమినేట్ చేద్దామని చెప్పావ్ అని అంటాడు నాగార్జున.

Bigg Boss Telugu 7 Day 20 Promo Nagarjuna Angry on Aata Sandeep

ఇక సందీప్ విషయంలోనూ నాగార్జున బాగా ఫైర్ అయ్యారు. సందీప్ నీకు అసలు గేమ్ అర్థమైందా.. శోభా వీక్ అని ఒప్పుకుంటే తనను ఎలిమినేట్ చేయాలి కానీ... ఏం చేశావ్.. సంచాల్ అంటే అంపైర్, ఆట మధ్యలో ఇంటర్‌ ఫైయిర్ అవ్వకూడదు.. మరి నువ్వెందుకు పాయింట్స్ ఇస్తున్నావ్ అంటూ నాగార్జున ఇచ్చిపడేశాడు. నువ్వు సంచాలక్‌ గా ఆడావా లేక పర్సనల్‌ గా ఆడావా అంటూ అడిగాడు.

అంటే కన్ఫ్యూజ్ అయ్యా సార్.. అని సందీప్ చెప్తాడు. దీంతో నాగార్జున అసలు నువ్వు కంటెండర్ కాదు.. మరి నిన్ను ఎందుకు పిలుస్తారు.. ఏమవసరం.. నువ్వు పెద్ద పిస్తావా? అంటూ విరుచుకుపడ్డారు నాగార్జున. ఇక సందీప్ సంచాలక్‌ గా ఫెయిల్ అయ్యాడంటే హ్యాండ్స్ ఎత్తమని చెప్తాడు. దీంతో సీరియల్ బ్యాచ్ తప్ప మిగిలిన వాళ్లంతా చేయి ఎత్తారు. ఇక నాగార్జన.. సందీప్ బ్యాటరీని గ్రీన్ నుంచి ఎల్లోకి దించేస్తారు. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X