Bigg Boss Telugu 7 Elimination ఉల్టా పుల్టా ఓటింగ్‌తో సేఫ్‌జోన్‌లో ఆ నలుగురు.. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 11వ వారం గేమ్ ముగిసేందుకు రంగం సిద్దమైంది. ఇంటిలో ఉండటానికి అర్హత లేని వ్యక్తిని ఇంటి నుంచి బయటకు పంపించేందుకు జరిగిన నామినేషన్ ప్రక్రియ తర్వాత భారీగా ఓటింగ్ నమోదు అవుతున్నది. ఈ వారం నామినేషన్‌లో టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి కలుగుతున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఓటింగ్ నిజంగా ఉల్టా పల్టాగా మారింది. ఈ ఓటింగ్ వివరాల్లోకి వెళితే..

గత పదివారాలుగా బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో క్రేజీగా కొనసాగుతున్నది. ఈ షోలో ఇప్పటి వరకు 10 మంది ఎలిమినేట్ అయ్యారు. గత వారం ఇంటి నుంచి సింగర్, కంపోజర్ భోలే షవాలీ బయటకు వచ్చాడు. ఆ తర్వాత జరిగిన 11వ వారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్లు ఒకరినొకరు నామినేట్ చేసుకొన్నారు.

 Bigg Boss Telugu 7 day 3 Voting for 11 week Elimination: Priyanka Jain, Shobha Shetty in danger zone

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో 11వ వారం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో శోభా శెట్టి, ప్రియాంక జైన్, అశ్వీని శ్రీ, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్ నామినేట్ అయ్యారు. శివాజీ కెప్టెన్ కావడం వల్ల నామినేట్ కాలేదు. పల్లవి ప్రశాంత్ ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకొన్నాడు.

ఇక 11వ వారం ఎలిమినేషన్ కోసం గత మూడు రోజులుగా ఓటింగ్ ఉల్టా పుల్టాగా మారింది. టాప్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటంతో అభిమానులు, ఫాలోవర్స్ భారీగా ఓటింగ్‌కు పాల్పడుతున్నారు. దాంతో రోజు రోజుకు డేంజర్ జోన్‌లో ఉన్నవారి పేర్లు మారిపోతున్నాయి. యాప్, మిస్డ్‌డ్ కాల్ డేటా ప్రకారం నలుగురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నారనే విషయం లీక్ అయింది.

11వ వారం నామినేట్ అయిన వారిలో ప్రిన్స్ యావర్ అత్యధికంగా ఓట్లతో ముందంజలో ఉన్నారు. 30 శాతం ఓట్లతో 1వ స్థానంలో ఉన్నారు. ఈ తర్వాత అమర్ దీప్ 22 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మూడో స్థానంలో రతిక రోజ్ 13 శాతం, గౌతమ్ కృష్ణ 10 శాతం ఓట్లతో నాలుగో స్థానంతోపాటు సేఫ్ జోన్‌లో కనిపించారు.

 Bigg Boss Telugu 7 day 3 Voting for 11 week Elimination: Priyanka Jain, Shobha Shetty in danger zone

ఇక 11వ వారం ఇంటిలో ఉండే అర్హత లేని వ్యక్తుల జాబితాలో అశ్వీనీ శ్రీ 9 శాతం ఓట్లతో 5వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అంబటి అర్జున్ 8 శాతం, ప్రియాంక జైన్ 7 శాతం, శోభా శెట్టి 6 శాతం ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఏదో మ్యాజిక్ జరిగితే తప్పా డేంజర్ జోన్‌లో ఉన్న వారు సేఫ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X