Bigg Boss 7 నుంచి క్రేజీ న్యూస్.. మారనున్న ఓటీటీ పార్టనర్? ఒప్పందంలో అలా!

బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి భారతదేశంలోకి బిగ్ బాస్ గా వచ్చింది. మొదట్లో ఎలా ఉంటుందో అనుకున్న ఈ రియాలిటీ షోపై ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ చూపించారు. దీంతో వివిధ భాషల్లోకి తీసుకురావడం మొదలు పెట్టారు. అలా తెలుగులో 2017లో మొదటి సీజన్ ను ప్రారంభించారు. ఇటీవల డిసెంబర్ 18న ఆరో సీజన్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం మొదటి నుంచే పకడ్బందీగా ప్లాన్ చేస్తూ షోను నిర్వహించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివిధ సెలబ్రిటీలను తీసుకొస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ డిజిటల్ పార్టనర్ గురించి ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతోంది.

ఒక్కటి తప్పా..

ఒక్కటి తప్పా..

ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులోకి వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. వీటిలో ఇటీవల పూర్తయిన ఆరో సీజన్ మినహా మిగతా సీజన్లు అన్నింటికి మంచి రేటింగ్ ను, ప్రేక్షకాదరణను పొందాయి.

 ఆడియెన్స్ ఓట్లతో అలా..

ఆడియెన్స్ ఓట్లతో అలా..

ఎన్నడూ చూడని, సరికొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, వెటకారాలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్ లతో సాగిన ఈ ఆరో సీజన్ ఫినాలేలో కూడా ట్విస్ట్ తోనే పూర్తి అయింది. మొత్తంగా ఈ సీజన్ లో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. ఇందులో సింగర్ రేవంత్ కు టైటిల్ రాగా.. శ్రీహాన్ ఆడియెన్స్ ఓట్లతో టాప్ 1లో ఉండాల్సినవాడు డబ్బు తీసుకోవడంతో రన్నరప్ గా నిలిచాడు.

ఆ కారణాలతో ఫ్లాప్ గా..

ఆ కారణాలతో ఫ్లాప్ గా..

బిగ్ బాస్ షో తెలుగు 6వ సీజన్ మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ లో జరిగిన తప్పుడు ఎలిమినేషన్స్, రాజకీయ ప్రభావంతో కొంతమంది హానెస్ట్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విమర్శలు ఎక్కువగా వెల్లువెత్తాయి. అందుకే దీనికి రేటింగ్ కూడా ఏమాత్రం బాగా రాకపోగా బిగ్ బాస్ పై నమ్మకాన్ని కూడా కొంత వరకు కోల్పోయిందనేది మరో టాక్. దీంతో ఈ ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ గా మారింది.

హోస్ట్ గా ఆ హీరో..

హోస్ట్ గా ఆ హీరో..

బిగ్ బాస్ తెలుగు 6లో అనేక పరిణామాలు చోటుచేసుకోవడం, అవన్నీ నాగార్జునకు నచ్చకపోవడంతో తర్వాతి సీజన్స్ కి హోస్ట్ గా తప్పుకున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని ఒకవైపు వార్తలు వినిపిస్తే.. మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా హోస్ట్ చేయనున్నాడని మరో వార్త వినిపిస్తోంది. ఇందులో రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేయగా.. బాలకృష్ణకు బీబీ టీమ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

హిట్ చేసే దిశగా..

హిట్ చేసే దిశగా..

ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో తర్వాత వచ్చే ఏడో సీజన్ ను ఎలాగైన సూపర్ హిట్ చేయాలని ప్రయత్నిస్తోంది బీబీ టీమ్. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకోసం హీరోలు, పాపులర్ టెలివిజన్ యాక్టర్స్, సింగర్స్, గత సీజన్ రన్నరప్స్, యూట్యూబర్స్ ను అప్రోచ్ అవుతూ డీల్ కుదుర్చుకుంటున్నట్లు ఇన్ని రోజులు వార్తలు షికార్లు చేశాయి. వారిలో బిగ్ బాస్ తెలుగు 1 సీజన్ రన్నరప్ ఆదర్శ్ బాలకృష్ణ, హీరో నవదీప్, యాక్టర్ అమర్ దీప్-తేజస్విని గౌడ్, సింగర్ మోహన భోగరాజు, నిఖిల్ విజయేంద్ర వంటి తదితరుల పేర్లు వినిపించాయి.

 ఇతర తెలుగు ఛానెళ్స్..

ఇతర తెలుగు ఛానెళ్స్..

ఇప్పుడు బిగ్ బాస్ షో బుల్లితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా వస్తుందన్ని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఓటీటీ పార్టనర్ మారనున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్టార్ మా అగ్రిమెంట్ ఎండమోల్ సంస్థతో పూర్తయినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది పూర్తి కాలేదని తాజా సమాచారం. బిగ్ బాస్ తెలుగు రైట్స్ కోసం ఇతర తెలుగు ఛానెళ్లు సంప్రదించాయట. అలాగే డిజిటల్ పార్టనర్ హక్కుల కోసం ఆహా కూడా అప్రోచ్ అయిందట. అయితే ఆహా ఇంకా ఓకే కాలేదని తెలుస్తోంది. ఒకవేళ ఈ అగ్రిమెంట్ ఓకే అయితే తర్వాత సీజన్ ఆహాలోనే స్ట్రీమింగ్ కానుంది.

అగ్రిమెంట్ సమస్యలు..

అగ్రిమెంట్ సమస్యలు..

ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నారని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ఇదే ఏడాది ఓటీటీ రెండో సీజన్ ఉంటుందని కూడా టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం పెండిగ్ పడిపోయిన అగ్రిమెంట్ సమస్యల కారణగా ఓటీటీ రెండో సీజన్ ఈ ఏడాది ఉండకపోవచ్చని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X