Bigg Boss Telugu 7: ఒక్కసారిగా ఉల్టా పుల్టాగా మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లో మేల్ కంటెస్టెంట్.. ఈసారి కూడా!
బుల్లితెరపై దూసుకుపోతున్న షోల్లో ఒకటి బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇప్పటికే 60 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో... 9 వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ ఎంత హీట్ ఎక్కించాయో తెలిసిందే. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవ్వనున్నారో ఆసక్తిగా మారింది. ఇక డేంజర్ జోన్ లో ఈ వారం టాప్ కంటెస్టెంట్స్ చేరారు. ఓటింగ్ వివరాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తిగా సాగుతోంది. ఇక 9వారాలు పూర్తి చేసుకోబోతున్న ఈ షో... మొదటి నుంచి ఉల్టా పుల్టాగా సాగుతోంది. మొదటి విడుతలో 14 మంది ఎంటర్ అయ్యారు. ఇక ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హౌస్ లో కేవలం 11 మంది ఉన్నారు. గత ఎనిమిది వారాల్లో 8 మంది ఎలిమినేట్ అవ్వగా... ఒకరు రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఇప్పటి వరకు షో నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, శుభ శ్రీ రాయగురు, రతికా రోజ్, నయని పవని, పూజా మూర్తి, ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యారు. ఇక రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చింది. గౌతమ్ ఫేక్ ఎలిమినేట్ అయిపోయి.. సీక్రెట్ హౌస్ కు వెళ్లి మళ్లీ అడుగుపెట్టాడు. ఇక ప్రతి వారం షాకులు, సర్ ప్రైజ్ లు ఇస్తూ.. బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇస్తాడు.
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, రతికా రోజ్, అశ్విని శ్రీ, బోలే షవాలి, అమర్ దీప్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్ ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. ఇక ఈ వారం అనగా 9వ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అంబటి అర్జున్, అమర్ దీప్, భోలే షావలి, యావర్, రతికా రోజ్, అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు ఉన్నారు.

9వ వారంలో ఓటింగ్ ప్రక్రియ.. మంగళవారాం నుంచి ప్రారంభం అయింది. ఇక మొదటి నుంచి ఊహించని రేంజులో ఓటింగ్ సాగుతోంది. ఇక తాజా ఓటింగ్ వివరాల ప్రకారం.. అమర్ దీప్ టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత యావర్, అర్జున్ అంబటి తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బోలే షవాలి ఉన్నాడు.
ఇక చివరి నాలుగు స్థానాల్లో ప్రియాంక, రతికా రోజ్, శోభా శెట్టి, టేస్టీ తేజ ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో మాత్రం శోభా శెట్టి, టేస్టీ తేజ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం మ్యాగ్జిమమ్ శోభా శెట్టి లేదా టేస్టి తేజ ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. ఇక చివరిలో టేస్టి తేజ ఉండటంతో ఈ వారం కూడా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది ఇక ఈరోజుతో ఓటింగ్ ముగియనుంది. ఏం జరగనుందో చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











