Bigg Boss Telugu 7: 13వ వారం ఓటింగ్‌లో ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్స్.. ఎలిమినేట్ మాత్రం అతడే!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7కు మరో 17 రోజులే మిగిలి ఉంది. డిసెంబర్ 17న ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతోంది. మరోవైపు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటేకే ఈ వారం నామినేషన్స్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే తాజాగా ఓటింగ్ సమాచారం డేంజర్ జోన్ లో ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం మేల్ ఎలిమినేషన్ తప్పేలా లేదని అర్థం అవుతుంది. అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు.. ఎవరు టాప్ లో ఉన్నారు.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ప్రతి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో 8మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియగా ఘాటుగానే జరిగింది. ఒక్క అమర్ దీప్ తప్ప.. హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

ప్రస్తుతం హౌస్ లో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక ఈ వారం అమర్ ఒక్కడు సేఫ్ లో ఉన్నాడు. ఇక నామినేషన్స్ లో ఉన్న 7 మంది కంటెస్టెంట్స్ లో ప్రశాంత్, శివాజీలకు ఓటింగ్ బాగానే నమోదు అవుతుంది. ఇక ఈ వారం కూడా వాళ్లు సేవ్ అవుతారని తెలుస్తోంది. ముందు నుంచి వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఎన్ని సార్లు నామినేషన్స్ లో ఉన్నా సేఫ్ జోన్ లోనే ఉంటున్నారు.
ఇక ఆ తర్వాతి స్థానంలో మొన్నటి వరకు ప్రియాంక జైన్ డేంజర్ జోన్ లో ఉండేది. మరి ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి ఒక్కసారిగా ఆమెకు ఓటింగ్ పెరిగింది. అమర్ దీప్ ఎపిసోడ్ ఎఫెక్ట్ లేదా ఆమె ఫ్యాన్స్ ఓటింగ్ వేశారో తెలియదు కానీ ముూడో స్థానంలోకి వచ్చేసింది. ఇక ఆ తర్వాతి స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఈయన కూడా డేంజర్ జోన్ లో ఉండే వాడు.. ఈరోజుకు మాత్రం నాలుగవ స్థానంలో ఉన్నాడు.

ఇక డేంజర్ జోన్ లో మాత్రం ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరి ఓటింగ్ ఎప్పుడైనా ఉల్టా పుల్టా కావొచ్చు. మరి ప్రతివారం శోభా శెట్టిని కాపాడుకుంటూ వస్తున్న బిగ్ బాస్.. ఒకవేళ ఎలిమినేషన్ జోన్ కు వస్తే ఎలా కాపాడుకుంటాడు అనేది ఆసక్తిగా మారింది. శోభా శెట్టి ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉంది. ఇక ఆరవ స్థానంలో యావర్ నిలిచాడు. ఏమైందో తెలియదు కానీ.. యావర్ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది.

ఇక చివరి స్థానంలో అర్జున్ అంబటి ఉన్నాడు. ఇక ఈ వారం యావర్ లేదా అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయిటే మరో వాదన ఏంటంటే.. ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎవిక్షన్ పాస్ ను ఈ వారం వాడుతారు అనే సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











