Bigg Boss Telugu 7: షాకింగ్ ఓటింగ్.. శివాజీ కంటే అతడికే ఓట్లు ఎక్కువ.. డేంజర్‌ జోన్‌లో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో విజయవంతగా 11వారాలు పూర్తి చేసుకుంది. ఇక 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది. నామినేషన్స్ లో 8 మంది టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఒక కంటెస్టెంట్ సెల్ఫ్ నామినేట్ చేసుకుని హైలెట్ గా నిలిచింది. ఇక ఓటింగ్ ప్రక్రియ కూడా మొదలు అయింది. ఇక తాజా ఓటింగ్ ప్రకారం ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక టాప్ లో ఎవరు ఉన్నారు.. ఈ వారం ఎవరికి తక్కువ ఓట్లు పడ్డాయి.. తాజా ఓటింగ్ సర్వేలో ఏం తేలింది అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే విభిన్నంగా సాగుతున్నాయి. ఇక 11 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక గత వారం ఎలిమినేషన్ లేదు అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులకు, కంటెస్టెంట్స్ కు ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ ఇలా.. పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

Bigg Boss Telugu 7 Elimination: Arjun Ambati, Rathika, Ashwini Sri Entered into Danger Zone in 12th Week

ఇక 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. 12వ వారం నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. మొత్తం ఈ వారం 8 మంది నామినేట్ అయ్యారు. అమర్ దీప్, ప్రశాంత్, గౌతమ్, శివాజీ, అశ్విని, రతికా రోజ్, శివాజీ, యావర్ నామినేట్ అయ్యారు. ఇక అశ్విని శ్రీ... నామినేట్ చేసేందుకు ఏ రీజన్స్ లేవని చెప్పి.. తనకు తానే సెల్ఫ్ నామినేట్ అయిపోయింది. ఇక ఈ భామపై విమర్శలు వస్తున్నాయి.

ఇక ఈ వారం ఓటింగ్ భారీగా నమోదు అయింది. నామినేషన్స్ లో ఎప్పుడు శివాజీ ఉన్నా... టాప్ ఓటింగ్ వచ్చేది. కానీ ఈ సారి ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయి. మరోవైపు అమర్ దీప్ ఆటలోనూ.. ఓటింగ్ లోనూ దూసుకుపోతున్నాడు. అమర్ దీప్ 31శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆయన ఆటలో చాలా మార్పు వచ్చింది. రాను రాను టైటిల్ విన్నర్ అయినా ఆశ్చర్యం లేదు. అంతలా ఆయన ఆటలో మార్పు వచ్చింది. జనాల్లో పాజిటివిటీ పెరిగింది.

Bigg Boss Telugu 7 Elimination: Arjun Ambati, Rathika, Ashwini Sri Entered into Danger Zone in 12th Week

ఇక ఆ తర్వాతి స్థానంలో ప్రశాంత్ ఉన్నాడు. ప్రశాంత్ కు 23శాతం ఓట్లు వచ్చాయి. ప్రశాంత్ టైటిల్ విన్నర్ రేసులో దూసుకుపోతున్నాడు. తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. ముందుకువెళ్తున్నాడు. అయితే ఈ వారం ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ విన్నర్ గా నిలిచాడు. ఇటు ఓటింగ్ లోనూ దూసుకుపోతున్నాడు. మరి ఎవిక్షన్ పాస్ ఎవరికోసం వాడుతాడో చూాడలి. ఇక శివాజీ 15శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఒకప్పుడు టాప్ ఓటింగ్ లో ఉండే శివాజీ.. తన నోటి దురుసుతో కిందకు దిగజారిపోతున్నాడు.

Bigg Boss Telugu 7 Elimination: Arjun Ambati, Rathika, Ashwini Sri Entered into Danger Zone in 12th Week

ఇక ఐదో స్థానంలో గౌతమ్ 11శాతం ఓటింగ్, ఆరో స్థానంలో యావర్ 10శాతం ఓటింగ్ లతో దూసుకుపోతున్నారు. ఇక రతికా రోజ్ కు 3.39శాతం ఓటింగ్, అర్జున్ కు 3.26శాతం, అశ్విని శ్రీకి 1శాతం ఓటింగ్ నమోదు అయ్యాయి. ఇక ఈ వారం ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఇంటి నుంచి వెళ్లేది మాత్రం రతికా రోజ్, అశ్విని శ్రీ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X