Bigg Boss Telugu 7: 13వ వారం సంచలన ఓటింగ్.. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్స్.. ఈసారి ఎలిమినేషన్?
బుల్లితెరపై ప్రేక్షాదరణ పొందుతున్న షో బిగ్ బాస్. ఇక సీజన్ 7 నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ 7 కూడా తుది అంకానికి చేరుకుంది. ఇక 13వ వారంలోకి అడుగుపెట్టిన ఈ షో... రోజు రోజుకు ఆకట్టుకుంటుంది. 13వ వారం నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా సాగాయి. నామినేషన్స్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఓటింగ్ మొదలు అయింది. ఇక తాజా ఓటింగ్ చూస్తే.. టాప్ లో టైటిల్ ఫేవరేట్లు ఉన్నారు. శివాజీ కంటే కూడా ఆ కంటెస్టెంట్ కు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఇక డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఇక సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో.. డిసెంబర్ 17న ముగియనుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ గత సీజన్స్ కంటే ఆసక్తిగా సాగుతోంది. ఇక 13వ వారంలోకి అడుగుపెట్టిన ఈ షో... నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్స్ లో ఈ వారం 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప.. అందరూ నామినేషన్ లోకి వచ్చేశారు. ప్రశాంత్, శివాజీ, యావర్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్, గౌతమ్ ఉన్నారు.

ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగాయి. అయితే అందరూ నామినేషన్స్ లో శివాజీని టార్గెట్ చేస్తారు అనుకున్నారు. లాస్ట్ వీక్ అమర్ విషయం గురించి అందరూ శివాజీని టార్గెట్ చేయాలి. కానీ అందరి రీజన్స్ చెత్తగా అనిపించాయి. ఇక ఒక్క గౌతమ్ మాత్రం శివాజీని కరెక్ట్ గా రీజన్ చెప్పి నామినేట్ చేశాడు అనిపించింది. ఆఖరికి అమర్ దీప్ కూడా సేఫ్ నామినేషన్ చేసి.. సేఫ్ గేమ్ ఆడాడు అనిపించింది.
ఇక మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ అయితే ముగిసింది. అయితే ఈ సారి సంచలన ఓటింగ్ నమోదు అవుతుంది. తాజా ఓటింగ్ చూస్తే.. శివాజీకి దెబ్బ పడిందని తెలుస్తోంది. మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా.. టాప్ 1లో పల్లవి ప్రశాంత్ నిలిచాడు. పల్లవి ప్రశాంత్ కు 28శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక రెండో స్థానంలో శివాజీ నిలిచాడు. శివాజీకి 26శాతం ఓటింగ్ రాగా.. యావర్ మూడో స్థానంలో ఉన్నాడు. యావర్ కు 16శాతం ఓటింగ్ నమోదు అయింది.

ఐదో స్థానంలో శోభా శెట్టి ఉండగా.. పది శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక ప్రియాంక ఆరో స్థానంలో ఉండగా.. 8శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక ఈ వారం గౌతమ్ అండ్ అర్జున్ డేంజర్ జోన్లో ఉన్నారు. గౌతమ్ 6వ స్థానంలో ఉండగా.. 7శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక అర్జున్ అంబటి చివరి స్థానంలో ఉండగా.. 5 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక ఈ వారం అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరనగుందో.


Click it and Unblock the Notifications











