Bigg Boss 7 Telugu: ఉల్టాపుల్టాగా మారిన ఓటింగ్.. డేంజర్‌ జోన్‌లో ముగ్గురు.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా సీజన్ కావడంతో.. మొన్నటి వరకు టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్... ఇప్పుడు డౌన్ కు వచ్చేశారు. ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే డేట్ కూడా ఫిక్స్ అయింది. డిసెంబర్ 17న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని నాగార్జున చెప్పారు. ఇక తాజాగా ఓటింగ్ వివరాలు చూస్తే.. డేంజర్ జోన్ లోకి ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ వచ్చేసారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతుంది. ఇక రోజుకో ట్విస్టు, రోజుకో షాక్ ఇస్తూ.. బిగ్ బాస్ షో నడుస్తుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, గౌతమ్, అర్జున్, ప్రియాంక జైన్, అశ్విని, రతికా రోజ్ ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఫినాలేకి చేరుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.

 Bigg Boss Telugu 7 Elimination: Ashwini and Arjun, Gautham Entered into Danger Zone in 12th Week

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియ నుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ అందరూ నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ ఆడుతున్నారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్కులు కూడా నిర్వహించారు. 13వ వారం కెప్టెన్సీ కంటెండర్స్ గా అర్జున్, అమర్ దీప్ ఉన్నారు. వీరికి సపోర్టుగా అర్జున్ కోసం శివాజీ, అమర్ కోసం శోభా శెట్ట దిగారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే.. అమర్ కన్నీళ్లు... ప్రేక్షకులకు కూడా బాధను తెప్పిస్తున్నాయి.

ఇక ఈ వారం ఓటింగ్ కూడా ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. కెప్టెన్ ప్రియాంక, శోభా శెట్టి తప్ప.. మిగతా వారంతా నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఓటింగ్ చూసుకుంటే... టాప్ లో రైతు బిడ్డ ఫ్రశాంత్ టాప్ లో ఉన్నాడు. ఎప్పుడు టాప్ లో ఉండే శివాజీ ఈ వారం మూడో స్థానానికి పడిపోయాడు. ఇక రెండో స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. అమర్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఆయన ఆటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

 Bigg Boss Telugu 7 Elimination: Ashwini and Arjun, Gautham Entered into Danger Zone in 12th Week

అమయకత్వం, ఇగో లేకుండా అమర్ ఆటను చూస్తున్నారు. ఇక అమర్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు.. కానీ అమర్ కెప్టెన్ అయ్యాడా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక నాలుగవ స్థానంలో యావర్ ఉన్నాడు. యావర్ కూడా ఆటను బాగానే ఆడుతున్నాడు. ఇక తదుపరి స్థానంలో గౌతమ్ ఉన్నాడు. ఈ వారం వీళ్లు సేఫ్ జోన్ ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో ముగ్గురు ఉన్నట్లు తెలు్స్తోంది. అర్జున్ అంబటి, అశ్విని శ్రీ, రతికా రోజ్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

 Bigg Boss Telugu 7 Elimination: Ashwini and Arjun, Gautham Entered into Danger Zone in 12th Week

ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. అందులో అశ్విని శ్రీ ఈవారం వెళ్లనుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఆమె తర్వాత అర్జున్ అంబటి, లేదా రతికా రోజ్ ఎలిమినేట్ కానున్నారట. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ కానున్నారో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X