Bigg Boss 7 Voting: 12వ వారం మైండ్ బ్లాక్ ఓటింగ్.. శివాజి, ప్రశాంత్‌కు షాక్.. ఈ వారం వాళ్లిద్దరే ఔట్
సరికొత్త కాన్సెప్టుతో నడిస్తూ.. అస్సలు ఊహించని ట్విస్టులు.. ఎప్పటికప్పుడు విభిన్నమై టాస్కులతో సాగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. అంచనాలు లేకుండా వచ్చినా ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయిందంటే ఇదే కారణం. అందుకే భారీగా రేటింగ్‌ను అందుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. ఇక, ఇప్పుడు నడుస్తున్న ఏడో సీజన్ కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ మజాను అందిస్తోంది. ఇక, ఇందులో 12వ వారానికి సంబంధించిన ఓటింగ్ రంజుగా మొదలైంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
అనుకోని విధంగా నడుస్తూ:భారీ అంచనాలను ఏర్పరచుకుని మొదలైన బిగ్ బాస్ ఏడో సీజన్ అనుకున్నట్లుగానే విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. మరీ ముఖ్యంగా ఉల్టా పుల్టాగా సాగుతోన్న ఈ సీజన్‌లో విభిన్నమైన అంశాలను చూపిస్తున్నారు. ఫలితంగా పాత సీజన్ల కంటే మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో మరింత జనరంజకంగా మారిపోయింది.

ఎలిమినేట్ అయింది వీళ్లే:ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు, ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి వచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారంలో భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ తీసేశారు.
ఈ సారి లిస్టులో 8 మంది:తాజాగా ప్రసారం అవుతోన్న సీజన్‌లో నామినేషన్ ప్రక్రియలు అన్నీ ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతి వారంలోనూ ఎన్నో రకాల గొడవలు జరుగుతోన్నాయి. అందుకు తగ్గట్లే 12వ వారం ప్రక్రియ చాలా రంజుగా సాగింది. ఈ టాస్కులో మొత్తంగా శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు.
మైండ్ బ్లాకింగ్ ఓటింగ్‌తో:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 12వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మైండ్ బ్లాక్ అయ్యేలా సాగుతోంది. ఈ సారి నామినేషన్స్‌లో ఎక్కువ మంది టైటిల్ ఫేవరెట్లు ఉండడంతో పోలింగ్ భారీగా జరుగుతున్నట్లు తెలిసింది. అయితే, అందురూ అనుకున్నట్లు ఈ సారి శివాజి, పల్లవి ప్రశాంత్ కాకుండా అమర్‌దీప్ చౌదరి టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

మిగిలిన స్థానాల్లో ఎవరు?:12వ వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో అమర్‌దీప్ చౌదరి టాప్ పొజిషన్‌లో కొనసాగుతూ ఉండగా.. అతడి తర్వాత ఉన్న వాళ్ల మధ్యన ఓట్ల శాతం చాలా తక్కువగా ఉందని సమాచారం. ప్రస్తుతం మాత్రం రెండో స్థానంలో శివాజి ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అంటే మూడు స్థానంలో పల్లవి ప్రశాంత్, నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్‌లు ఉన్నారని వార్త లీక్ అయింది.
ఆ స్ట్రాంగ్ ప్లేయర్లూ షాక్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని 12వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో స్ట్రాంగ్ ప్లేయర్లుగా భావిస్తున్న గౌతమ్ కృష్ణ, అంబటి అర్జున్‌లకు కూడా తక్కువ ఓట్లే పోల్ అవుతున్నాయని సమాచారం. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం గౌతమ్ కృష్ణ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడని తెలిసింది. అలాగే, మరో బలమైన కంటెస్టెంట్ అంబటి అర్జున్ ఆరో స్థానంలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఈ వారంలో ఈ ఇద్దరే ఔట్:12వ వారానికి గానూ ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో రతికా రోజ్ ఏడో స్థానంలో, సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అశ్విని శ్రీ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంటే ఇప్పటికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో ఎక్కువ శాతం అశ్విని, రతికా రోజ్‌లు ఎలిమినేట్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











