Bigg Boss Elimination: 12వ వారం నమ్మలేని ఎలిమినేషన్.. ఒక మేల్, ఒక ఫీమేల్ ఔట్.. అలా కూడా జరగొచ్చు!

అస్సలు అంచనాలు వేయలేని కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో మజాను అందిస్తోన్న షోనే బిగ్ బాస్. చాలా భాషల్లో వస్తున్నా తెలుగులోనే ఇది సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా బిగ్ బాస్ టీమ్ వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తూనే ఉంటోంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్‌లో 12వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఈసారి ఏం జరగబోతుందో మీరే చూసేయండి!

Bigg Boss Telugu 7 Elimination

ఊహించని కంటెంట్‌తోనే: ఉల్టా పుల్టా కాన్సెప్టు అంటూ బిగ్ బాస్ ఏడో సీజన్‌పై నిర్వహకులు అంచనాలను పెంచేశారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇందులో ఊహించని టాస్కులు, సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌లో ఎన్నో అనుకోని మలుపులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రేక్షకుల నుంచి మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా రేటింగ్ కూడా బాగానే దక్కుతోంది.

వెళ్లిపోయింది ఎవరంటే: ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు, ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్‌, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారంలో భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు.

12వ వారంలో 8 మంది: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో నామినేషన్ ప్రక్రియలు ఎక్కువ శాతం ఎన్నో గొడవలతో రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతి వారంలోనూ ఎన్నో రకాల గొడవలు జరుగుతోన్నాయి. అందుకు తగ్గట్లే 12వ వారం ప్రక్రియ చాలా రంజుగా సాగింది. ఇందులో మొత్తంగా శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు.

ట్విస్టులతో సాగిన ఓటింగ్: ఏడో సీజన్‌లో 12వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎన్నో ట్విస్టులతో సాగినట్లు తెలిసింది. ఈ సారి నామినేషన్స్‌లో ఎక్కువ మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండడంతో పోలింగ్ భారీగా నమోదు అయింది. అయితే, అందురూ అనుకున్నట్లు ఈ సారి శివాజి, పల్లవి ప్రశాంత్‌ కాకుండా అమర్‌దీప్ చౌదరి పలుమార్లు టాప్‌లోకి వచ్చాడు. కానీ, చివరికి రైతు బిడ్డే ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు.

Ashwini, Rathika and Gautham Two of These Three Will Eliminate in 12th Week

మిగిలిన స్థానాల్లో ఎవరు?: 12వ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ అందరి కంటే ముందు ఉండగా.. అతడి తర్వాత ఉన్న వాళ్ల మధ్యన ఓట్ల శాతం చాలా తక్కువగా ఉందని సమాచారం. పోలింగ్ ముగిసే సమయానికి రెండో స్థానంలో అమర్‌దీప్ చౌదరి ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అంటే మూడు స్థానంలో శివాజి, నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్‌లు ఉన్నారని వార్త బయటకు వచ్చింది.

Ashwini, Rathika and Gautham Two of These Three Will Eliminate in 12th Week

డబుల్ కావడంతో డౌట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని 12వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో స్ట్రాంగ్ ప్లేయర్లు అయిన అంబటి అర్జున్ ఐదో స్థానంలో నిలిచినట్లు తెలిసింది. అలాగే, మరో బలమైన కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ ఆరో స్థానంలో ఉన్నాడని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో వీళ్లిద్దరిలో ఒకరిని అంటే ఎక్కువ శాతం గౌతమ్‌ను పంపే చాన్స్ కూడా ఉందట.

Ashwini, Rathika and Gautham Two of These Three Will Eliminate in 12th Week

ఆమె కన్ఫార్మ్.. ఇంకొకరు: 12వ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌లో రతికా రోజ్ ఏడో స్థానంలో, అశ్విని శ్రీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. వీరిలో ఈ వారం అశ్విని ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. డబుల్ ఉన్నా లేకున్నా ఆమె వెళ్లిపోతుందని తెలుస్తోంది. ఇద్దరిని పంపించాల్సి వస్తే ఆమెతో పాటు గౌతమ్‌ను పంపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఎవిక్షన్ పాస్ ట్విస్ట్ ఇచ్చే చాన్స్ కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X