Bigg Boss 7 Telugu Voting: 12వ వారం సంచలన ఓటింగ్.. టాప్‌లో టైటిల్ ఫేవరెట్లు.. నో డౌట్ ఆ ఇద్దరు ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతుంది. ఇప్పటికే 11వారాలు పూర్తి చేసుకున్న ఈ షో... 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. 12వ వారం నామినేషన్స్ లో 6 మంది టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పారు. దాంతో ఉన్న ఆరుగులో ఎవరు ఎలిమినేట్ కానున్నారు.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే ఆసక్తిగా సాగుతోంది. ఇక ఉల్టా పుల్టా అంటూ ప్రతి వారం ప్రేక్షకులకు బిగ్ బాస్ షాకింగ్ ట్విస్టులు, షాకులు ఇస్తూ.. థ్రిల్లింగ్ ను కలిగిస్తున్నాడు. ఇక హౌస్ లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అందులో శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్, రతికా రోజ్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అశ్విని శ్రీ ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది.

Bigg Boss Telugu 7 Elimination

ఇక ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. నామినేషన్స్ ఆరు మంది టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, అర్జున్ అంబటి, ప్రశాంత్, అశ్విని ఉన్నారు. వీరిలో అశ్విని సెల్ఫ్ నామినేషన్ తో హైలెట్ గా నిలిచింది. ఈ బ్యూటీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరినీ సిల్లీ రిజన్స్ తో నామినేట్ చేయలేను బిగ్ బాస్ అని చెప్పింది. దీంతో సెల్ఫ్ నామినేట్ అయిపోతారు అని బిగ్ బాస్ చెప్పినా.. ఈ భామ సెల్ఫ్ నామినేషన్లోకి వెళ్లిపోయింది.

గతంలో యావర్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నప్పటికీ ఆయనకున్న క్రేజ్ తో సేఫ్ అయిపోయాడు. మరి ఈ హాట్ బ్యూటీ సెల్ఫ్ నామినేషన్ తో ఓవర్ చేసిందని అంటున్నారు నెటిజన్స్. ఇక డబుల్ ఎలిమినేషన్ కాబట్టి.. ఈ వారం అశ్విని ఔట్ అని అంటున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లేకుండా సేఫ్ అయిన వారు శివాజీ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, యావర్ ఉన్నారు. ప్రియాంక కెప్టెన్ కావడంతో.. ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు.

Ashwini Sri and Rathika Rose Entered into Danger Zone in 12th Week

ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆన్ లైన్ ఓటింగ్ లో ప్రశాంత్, అమర్ దీప్ టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రస్తుతానికి ఓటింగ్ బాగానే నమోదు అవుతుంది. ఇక ఈ వారం వీరు సేఫ్ అవుతారడంలో సందేహం లేదు. మొదటి నుంచి అమర్ దీప్ కు నెగిటివిటీ వచ్చినప్పటికీ.. ఇటీవల కాలంలో అమర్ కు పాజిటివిటీ వస్తుంది. ఇక ప్రశాంత్ కు కూడా ఆదరణ పెరుగుతుంది.

Ashwini Sri and Rathika Rose Entered into Danger Zone in 12th Week

ఇక ఆ తర్వాతి స్థానంలో గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి ఉన్నారు. వీరికి మోస్తరుగా ఓటింగ్ నమోదు అవుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పడంతో.. కంటెస్టెంట్స్ అందరికీ భయం పట్టుకుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో అని ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఇక డేంజర్ జోన్ లో రతికా రోజ్, అశ్విని శ్రీలు నిలిచారు. ఈ వారం ఈ బ్యూటీలు ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. వీరు ఇరువురు ఈసారి ఎలిమేట్ అయిపోతే.. హౌస్ లో ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్స్, 6 మంది మేల్ కంటెస్టెంట్స్ ఉంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X