Bigg Boss Voting: 3వ వారంలో షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఊహించని కంటెస్టెంట్.. లాస్ట్‌ ఎవరో తెలిస్తే!

కొత్త కాన్సెప్టుతో వచ్చినా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఏకైక షో బిగ్ బాస్. బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ రకరకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ సాగిపోతోందీ షో. అందుకే తెలుగులో ఇది ఏకంగా ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి అన్నట్లు రెస్పాన్స్‌ను అందుకుంటూ సూపర్ హిట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో మూడో వారం ఓటింగ్ షాకింగ్‌గా సాగుతోంది. మరి ఇప్పుడు ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో మీరే చూసేయండి!

ఉల్టా పుల్టా కావడంతో ఆసక్తిగా:ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే బిగ్ బాస్ భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో సీజన్‌ను కూడా ప్రయోగాత్మకంగా మొదలు పెట్టారు. ఇందులో ఆరంభం నుంచే గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను అందిస్తున్నారు. అయినప్పటికీ ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే వస్తూ రేటింగ్ రాబట్టేదు.

 Bigg Boss Telugu 7 Elimination: Damini and Gautham Krishna Entered into Danger Zone 3rd Week

ఇద్దరూ లేడీసే ఎలిమినేషన్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా బయటకు వెళ్లిపోయారు.

ఈసారి ఏడుగురు నామినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని మూడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగానే సాగింది. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతికా రోజ్, శుభశ్రీ రాయగురు, అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నారు. వీరిలో టేస్టీ తేజ స్థానంలో అమర్‌ను స్వైప్ చేశారు.

 Bigg Boss Telugu 7 Elimination: Damini and Gautham Krishna Entered into Danger Zone 3rd Week

షాకింగ్ ఓటింగ్.. పోటీగానే:బిగ్ బాస్ మూడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ షాకింగ్‌గా సాగుతున్నట్లు తెలిసింది. అయితే, ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కొందరు ఉన్నప్పటికీ ఊహించని కంటెస్టెంట్లకు ఎక్కువగా మద్దతు లభిస్తుంది. దీంతో అమర్‌దీప్ చౌదరి, రతికా రోజ్ వంటి టాప్ ప్లేయర్లు ఉన్నా.. ప్రిన్స్ యావర్ ఈ వారం జరుగుతున్న ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నాడని తెలిసింది.

 Bigg Boss Telugu 7 Elimination: Damini and Gautham Krishna Entered into Danger Zone 3rd Week

ఎవరు ఏ స్థానంలో అంటే:బిగ్ బాస్ ఏడో సీజన్ మూడో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ తర్వాత అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరికీ ఎంతో ఓటింగ్ తేడా లేదు. దీంతో తరచూ వీళ్ల స్థానాల్లో మార్పులు వస్తున్నాయి. తర్వాత స్థానాల్లో మాత్రం మార్పులు కనిపించట్లేదు. శుభశ్రీ మూడో స్థానంలో, రతిక నాలుగో స్థానంలో, ప్రియాంక జైన్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

 Bigg Boss Telugu 7 Elimination: Damini and Gautham Krishna Entered into Danger Zone 3rd Week

డేంజర్‌ జోన్‌లో ఎవరంటే?:మూడో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో గౌతమ్ కృష్ణ ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. దామిని ఏడో స్థానంలో ఉంది. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్‌కు ఇంకా మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే వేరే ఎవరైనా డేంజర్‌ జోన్‌లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X