Bigg Boss Voting: ఓటింగ్‌లో పెను సంచలనం.. టాప్ ప్లేయర్లకు షాక్.. 3వ వారం లాస్ట్‌లో ఉన్నది ఎవరంటే!
బుల్లితెరై ఎప్పుడూ చూడని కాన్సెప్టు.. ఊహకే అందని టాస్కులు.. చిత్ర విచిత్రమై సంఘటనలు.. ప్రేమ కహానీలు.. రొమాన్స్‌ను పండించే సన్నివేశాలు ఇలా రకరకాల పరిణామాలతో ఆసక్తికరంగా సాగుతోన్న ఏకైక షోనే బిగ్ బాస్. ఇది నేషనల్ లెవెల్‌లో రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఇంతటి విజయవంతమైన ఈ షో ఏడో సీజన్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇందులో ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ జరగ్గా.. మూడో వారంలో ఓటింగ్ మాత్రం చాలా ట్విస్టులతో సాగుతోంది. ఇంతకీ ఈ వారం టాప్‌లో ఎవరున్నారు? డేంజర్ జోన్‌లోకి ఎవరు వెళ్లారు? చూద్దాం పదండి!
ఉల్టా పుల్టా సీజన్‌కు రెస్పాన్స్:బిగ్ బాస్ షో తెలుగులో ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకోవడంతో ఏడో దానిపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సారి ఉల్టా పుల్టా సీజన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామంటూ నిర్వహకులు ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే అన్ని సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తూ షోను ఆసక్తిగా మార్చుతున్నారు.

ఇద్దరూ లేడీసే వెళ్లిపోయారు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయిపోయారు.

3వ వారం 7 గురు నామినేట్:మూడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో రంజుగానే సాగింది. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక, రతికా రోజ్, శుభశ్రీ రాయగురు, అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నారు. వాస్తవానికి తేజ నామినేషన్స్‌లో ఉండగా సందీప్, శివాజి కలిసి అమర్‌ను అతడితో స్వాప్ చేశారు.
ఓటింగ్ మాత్రం షాకింగ్‌గా:ఏడో సీజన్ మూడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎన్నో ట్విస్టులతో సాగుతున్నట్లు తెలిసింది. అయితే, ఇందులో అమర్‌దీప్, రతికా రోజ్, ప్రియాంక వంటి టాప్ ప్లేయర్లు ఉన్నప్పటికీ మొన్నటి టాస్కులో అద్భుతంగా ఆడిన ప్రిన్స్ యావర్ ఎక్కువ ఓట్లు సాధిస్తున్నట్లు తెలిసింది. అయితే, అతడికి అమర్‌దీప్‌కు మధ్య ఓటింగ్ పర్సెంట్ చాలా తక్కువగా ఉందని సమాచారం.

ఎవరు ఏ స్థానంలో అంటే:ఈ వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ తర్వాత అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం ఎన్నో రకాల మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. మొదట్లో ఉన్న వాళ్లు కాకుండా ఇప్పుడు మూడో స్థానంలో గౌతమ్ కృష్ణ, నాలుగో స్థానంలో రతికా రోజ్, ఐదో స్థానంలో ప్రియాంక జైన్‌లు ఉన్నట్లు తాజాగా తెలిసింది.

డేంజర్ జోన్‌లో ఎవరంటే?:మూడో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో శుభశ్రీ రాయగురు ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. దామిని ఏడో స్థానంలో ఉంది. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్‌కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో వీళ్లు తేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వారంలో దామినినే ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











