Bigg Boss Elimination: ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. చివరి రోజు తారుమారు.. ఈ సారి ఆ అమ్మాయే ఎలిమినేట్

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇండియా వ్యాప్తంగా చాలా భాషల్లోకి పరిచయమై.. దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఈ షో అత్యంత భారీ రెస్పాన్స్‌ను అందుకుని టాప్ రేటింగ్‌తో దుమ్ము దులుపుతోంది. ఫలితంగా వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని కూడా మొదలు పెట్టారు. ఇందులో ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు జరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో వారం ఓటింగ్ కూడా ట్విస్టులతో ముగిసింది. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం పదండి!

కొత్త కంటెంట్‌తో ఫుల్ మజా : ఆరో సీజన్ ఆశించిన రీతిలో సాగకపోవడంతో నిర్వహకులు ఏడో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ సారి ఉల్టా పుల్టా సీజన్‌తో వినోదాన్ని పంచుతామని ముందే తెలిపారు. ఇందులో భాగంగానే ప్రీమియర్ ఎపిసోడ్‌ నుంచే ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తూ షోను ఆసక్తిగా మార్చుతున్నారు. తద్వారా ప్రేక్షకులకు మజాను పంచుతూనే ఉన్నారు.

Bigg Boss Telugu 7 Elimination: Damini or Shubasree Will Eliminate In 3rd Week

ఎవరెవరు వెళ్లిపోయారంటే : తాజా సీజన్‌లోకి శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, ప్రియాంక జైన్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఈ సారి నామినేషన్‌లో వీళ్లే : మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో రంజుగానే సాగింది. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక, రతికా రోజ్, శుభశ్రీ రాయగురు, అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నారు. వాస్తవానికి తేజ నామినేషన్స్‌లో ఉండగా సందీప్, శివాజి కలిసి తమకున్న స్పెషల్ పవర్‌తో అమర్‌ను అతడితో స్వాప్ చేశారు.

Bigg Boss Telugu 7 Elimination: Damini or Shubasree Will Eliminate In 3rd Week

ఓటింగ్‌లో ట్విస్ట్.. యావరే : ఏడో సీజన్ మూడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో సాగినట్లు తెలిసింది. అయితే, ఇందులో అమర్‌దీప్, రతికా రోజ్, ప్రియాంక వంటి టాప్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎవరూ ఊహించని కంటెస్టెంట్లు అత్యధిక ఓట్లు సంపాదించారు. ముఖ్యంగా ఈ వారం టాస్కుల్లో ఇరగదీసిన ప్రిన్స్ యావర్ ఎక్కువ ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడని సమాచారం.

అమర్‌దీప్‌కు భారీ దెబ్బ : మూడో వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన అమర్‌దీప్ కూడా ఉన్నాడు. అతడు ప్రిన్స్ యావర్‌తో పోటీ పడి కొన్ని సార్లు టాప్ ప్లేస్‌కు సైతం వచ్చినట్లు తెలిసింది. అయితే, ఓటింగ్ చివరి రోజు మాత్రం అమర్‌కు గౌతమ్ కృష్ణ బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. అంటే.. ఇప్పుడు డాక్టర్ బాబే టాప్‌ 2గా నిలిచినట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Bigg Boss Telugu 7 Elimination: Damini or Shubasree Will Eliminate In 3rd Week

ఏ స్థానంలో ఎవరు అంటే : మూడో వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ తర్వాత గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో నిలిచినట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. ఇక, ఇదే సమాచారం ప్రకారం.. పోలింగ్ పూర్తయ్యే సమయానికి మూడో స్థానంలో అమర్‌దీప్ చౌదరి, నాలుగో స్థానంలో రతికా రోజ్, ఐదో స్థానంలో ప్రియాంక జైన్‌లు ఉన్నారు. ఈ వారం వీళ్లంతా దాదాపుగా సేఫ్ అయినట్లే చెప్పాలి.

ఎలిమినేట్ అయ్యేది ఆమె : బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని మూడో వారానికి సంబంధించిన ఓటింగ్‌ పూర్తయ్యే సమయానికి శుభశ్రీ రాయగురు ఆరో స్థానంలో నిలవగా.. దామిని ఏడో స్థానంలో ఉంది. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం ఈ వారం దామినినే ఎలిమినేట్ అవ్వొచ్చు. ఇది బిగ్ బాస్ షో కాబట్టి శుభశ్రీని కూడా బయటకు పంపే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X