Bigg Boss Elimination: 13వ వారం సంచలన ఎలిమినేషన్.. ఓట్లు వాళ్లకు తక్కువ.. వెళ్లిపోయేది మాత్రం అతడే!

ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి పరిచయం అయినా.. అతి తక్కువ సమయంలోనే సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో నడిచేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందించారు.

ఫలితంగా దేశంలోనే ఇది నెంబర్ వన్ షోగా మారింది. దీంతో ఇప్పుడు ఏడో సీజన్‌ను కూడా ఎంతో ఉత్సాహంతో నడుపుతున్నారు. ఇందులో ఎవరూ ఊహించని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 13వ వారంలో సంచలన ఎలిమినేషన్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

Bigg Boss Telugu 7 Elimination

చివరి స్టేజ్‌లో మరింతగా: బిగ్ బాస్ షో ఎన్నో భాషల్లో ప్రసారం అవుతున్నా.. తెలుగులో మాత్రమే అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఆరో సీజన్‌ను నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సరికొత్తగా నడుపుతున్నారు. ఇప్పుడిది చివరి స్టేజ్‌కు చేరుకోవడంతో మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ఇందుకోసం ఎన్నో ప్రయోగాలు చేస్తూ మజాను పంచుతున్నారు.

ఎవరెవరు వెళ్లిపోయారు?: ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని పావని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతికలు వెళ్లిపోయారు.

ఈ వారం అతడు తప్ప: గతంలో కంటే ఉల్టా పుల్టాగా సాగుతోన్న ఏడో సీజన్‌లో నామినేషన్స్ ప్రక్రియలను ఎంతో విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇందులో ప్రతి వారం గొడవలు జరుగుతూ రచ్చ లేపుతున్నాయి. ఈ క్రమంలోనే 13వ వారం రంజుగా సాగిన నామినేషన్స్‌ టాస్కులో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు.

ఓటింగ్‌లో ట్విస్టులతో: ఏడో సీజన్‌లో 13వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎన్నో ట్విస్టులతో సాగినట్లు తెలిసింది. ముఖ్యంగా ఫినాలేకు ముందు వచ్చే వారం కావడంతో పాటు ఈ సారి నామినేషన్స్‌లో టాప్ కంటెస్టెంట్లు ఉండడంతో పోలింగ్ ఊహించని విధంగా సాగింది. ఇక, ఇందులో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న శివాజి, పల్లవి ప్రశాంత్‌ మధ్యనే టాప్ ప్లేస్ కోసం పోటీ జరిగినట్లు తెలిసిందే.

Gautham or Shobha or Priyanka Will Eliminate in 13th Week

చివరికి అతడే టాప్‌లో: బిగ్ బాస్ షోలో ఏడో సీజన్‌కు సంబంధించిన 13వ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌లో మొదట్లో శివాజి టాప్‌లో ఉన్నాడు. అయితే రెండో రోజు నుంచి పల్లవి ప్రశాంత్ అతడికి గట్టి పోటీని ఇచ్చాడు. ఫలితంగా అప్పటి నుంచీ ఈ రైతు బిడ్డనే ఓటింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగినట్లు తెలిసింది. అయితే, వీళ్లిద్దరి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉందని బిగ్ బాస్ వర్గాల ద్వారా న్యూస్ లీకైంది.

Gautham or Shobha or Priyanka Will Eliminate in 13th Week

ప్రిన్స్ తర్వాత చేంజ్: ఏడో సీజన్‌లో 13వ వారానికి జరిగిన ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ టాప్ పొజిషన్‌లో నిలవగా.. అతడి తర్వాత అంటే రెండో స్థానంలో శివాజినే ఉన్నాడు. వీళ్ల సహచరుడు ప్రిన్స్ యావర్‌ మూడో స్థానంతో ఈ వారం సేఫ్ అయ్యాడని తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత స్థానాల్లో ఎన్నో మార్పులు కనిపించాయి. ఇప్పుడైతే నాలుగో స్థానంలో అంబటి అర్జున్ ఉన్నాడని సమాచారం.

Gautham or Shobha or Priyanka Will Eliminate in 13th Week

స్ట్రాంగ్ ప్లేయర్ ఔట్: 13 వారం ఓటింగ్‌లో గౌతమ్ కృష్ణ ఐదో స్థానంలో, ప్రియాంక జైన్ ఆరో స్థానంలో, ఏడో స్థానంలో శోభా శెట్టిలు ఉన్నారని తెలిసింది. అంటే ఈ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవాలి. అయితే, కంపల్సరీ లేడీ కంటెస్టెంట్లను ఫినాలేకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే గౌతమ్‌ను ఈ వారం ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ఓ సంచలన న్యూస్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X