Bigg Boss Elimination: ఓటింగ్‌లో ట్విస్ట్.. ఆ బ్యూటీకి పెరిగిన సపోర్ట్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే!

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ కార్యక్రమం దాదాపు ఏడేళ్లుగా అదిరిపోయే రెస్పాన్స్‌తో భారీ రేటింగ్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షో అనిపించుకుంటోంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఏడో సీజన్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా మొదటి వారం నామినేట్ అయిన సభ్యుల ఓటింగ్‌లో ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూద్దాం పదండి!

సరికొత్త కాన్సెప్టుతో రంజుగానే:తెలుగులో సక్సెస్‌ఫుల్‌ షోలలో ఒకటైన బిగ్ బాస్.. ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నిర్వహకులు గత ఆదివారం ఏడో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ సీజన్‌లో ఎన్నడూ చూడని సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆసక్తిని పెంచేశారు. ముఖ్యంగా ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారు.

Bigg Boss Telugu 7 Elimination: Kiran Rathod and Damini Entered into Danger Zone

14 మందే... వేరే కంటెస్టెంట్లు:తాజా సీజన్‌లోకి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు ఉన్నారు. వీరితో పాటు మరికొందరు కూడా ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.

ఈ వారం 8 మంది నామినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి మొదటి వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయిపోయారు. వారిలో పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒకటే ఓట్ చేసే అవకాశం ఉండడంతో ఎలిమినేషన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

Bigg Boss Telugu 7 Elimination: Kiran Rathod and Damini Entered into Danger Zone

ఫస్ట్ వీక్‌లోనే షాకింగ్‌ ఓటింగ్:ఏడో సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ గత మంగళవారం రాత్రి 10.30 గంటల నుంచి మొదలైంది. ఇది ఎన్నో ట్విస్టులతో సాగుతున్నట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ టాప్‌లో కొనసాగుతున్నాడు. రానూ రానూ అతడికి సపోర్టు భారీగా పెరుగుతోంది.

Bigg Boss Telugu 7 Elimination: Kiran Rathod and Damini Entered into Danger Zone

ఆ బ్యూటీకి పెరిగిన మద్దతు:మొదటి వారం ఎలిమినేషన్‌కు సంబంధించి ఓటింగ్ మొదలైన తర్వాత పల్లవి ప్రశాంత్ తర్వాత కార్తీక దీపం ఫేం శోభా శెట్టి రెండో స్థానంలో ఉంది. ఒక రోజు మొత్తం ఆమెనే ఆ ప్లేస్‌లో కొనసాగింది. అయితే, గురువారం మాత్రం ఓటింగ్‌లో ట్విస్ట్ కనిపించింది. ఫలితంగా రతికా రోజ్‌కు మద్దతు పెరిగింది. దీంతో ఆమె శోభా శెట్టిని వెనక్కి నెట్టేసి రెండో స్థానానికి చేరుకుంది.

Bigg Boss Telugu 7 Elimination: Kiran Rathod and Damini Entered into Danger Zone

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు:బిగ్ బాస్ ఏడో సీజన్ మొదటి వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మార్పులు కనిపించేలా ఓటింగ్ కొనసాగుతునట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం శోభా శెట్టి మూడో స్థానంలో, గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో, షకీలా ఐదో స్థానంలో, ప్రిన్స్ యావర్ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిసింది.

Bigg Boss Telugu 7 Elimination: Kiran Rathod and Damini Entered into Danger Zone

వాళ్లిద్దరూ డేంజర్ జోన్‌లోనే:మొదటి వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ మొదట్లో ఏడో స్థానంలో ఉండగా.. అతడికి సపోర్టు కాస్త పెరిగి ఆరో స్థానానికి చేరాడు. దీంతో దామిని ఏడో స్థానానికి పడిపోయింది. అలాగే, కిరణ్ రాథోడ్ ఎనిమిదో స్థానంలో ఉండి డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అంటే వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X