Bigg Boss Elimination: మొదటి వారమే షాకింగ్ ఓటింగ్.. చిన్న కంటెస్టెంట్ టాప్.. వాళ్లిద్దరూ డేంజర్ జోన్

తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా.. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేక్షకులను మజాను పంచుతోంది బిగ్ బాస్. ఎంటర్‌టైన్‌మెంట్‌కు హద్దులు ఉండవని నిరూపించిన ఈ షో.. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని టీఆర్పీ రేటింగ్‌తో నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ సెట్ చేసింది. ఇలా ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఏడోది కూడా గత ఆదివారమే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఏడో సీజన్ మొదటి వారం జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ లీక్ అయింది. ఇందులో ఎవరెవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో మీరే చూడండి!

ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఆసక్తిగా:చాలా తక్కువ సమయంలోనే తెలుగులో విశేషమైన స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే ఇది ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నిర్వహకులు గత ఆదివారం ఏడో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ సీజన్‌లో ఎన్నడూ చూడని సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆసక్తిని పెంచేశారు.

 Bigg Boss Telugu 7 Elimination: Kiran Rathod and Prince Yawar Entered into Danger Zone

14 మందే.. వాళ్లు వస్తారంటూ:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు ఉన్నారు. మరికొందరు కూడా వస్తారని చెప్తున్నారు.

రెండు రోజుల పాటు ప్రక్రియ:సాధారణంగా బిగ్ బాస్ లో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం రాత్రి మాత్రమే ప్రసారం అవుతుంది. కానీ, ఏడో సీజన్‌లో మాత్రం సోమ, మంగళవారాలు కూడా కొనసాగింది. ఇక, ఈ సీజన్‌లో మొదటి వారానికి సంబంధించిన నేరుగా కాకుండా వేర్వేరే రూమ్‌లలో జరిగింది. ఒక కంటెస్టెంట్ ఇద్దరిని ఎంపిక చేసుకుని కారణాలు చెప్పగా.. వాళ్లు కన్ఫెషన్ రూమ్‌ను వీక్షించారు.

 Bigg Boss Telugu 7 Elimination: Kiran Rathod and Prince Yawar Entered into Danger Zone

ఈ వారం 8 మంది నామినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి సీజన్‌లో మొదటి వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయిపోయారు. వారిలో పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, దామినిలు నామినేట్ అయ్యారు. మిగిలిన వాళ్లంతా మొదటి వారానికి గానూ నామినేషన్స్ తప్పించుకున్నారు.

ఫస్ట్ వీక్‌లోనే షాకింగ్‌ ఓటింగ్:బిగ్ బాస్ ఏడో సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి నుంచి మొదలైంది. ఇది ఎంతో ఆసక్తికరంగా, షాకింగ్‌గా సాగుతున్నట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత కార్తీక దీపం నటి శోభా శెట్టి ఉంది.

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు:బిగ్ బాస్ ఏడో సీజన్ మొదటి వారంలో జరిగిన ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతునట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం రతికా రోజ్ మూడో స్థానంలో, గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో, షకీలా ఐదో స్థానంలో, దామిని ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిసింది.

 Bigg Boss Telugu 7 Elimination: Kiran Rathod and Prince Yawar Entered into Danger Zone

వాళ్లిద్దరూ డేంజర్ జోన్‌లోనే:మొదటి వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగ్‌లో పెద్దగా ఫాలోయింగ్ లేని ప్రిన్స్ యావర్ ఏడో స్థానంలో, కిరణ్ రాథోడ్ ఎనిమిదో స్థానంలో ఉండి డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అంటే వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాను రానూ ఈ ఓటింగ్‌లో మార్పులు వస్తే ఎలిమినేషన్ కూడా మారే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X