Bigg Boss Elimination: బిగ్ బాస్‌కే దిమ్మ తిరిగే ఓటింగ్.. 40 శాతం ఒకరికే.. ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే!
చిత్ర విచిత్రమైన సంఘటలు.. ఊహకే అందని మలుపులు.. మొత్తంగా సరికొత్త కంటెంటెతో సాగుతూ ప్రేక్షకులకు మజాను అందిస్తోన్న రియాలిటీ షోనే బిగ్ బాస్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులో మొదలైన ఈ కార్యక్రమం.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే ఇది సూపర్ సక్సెస్ అయింది. దీంతో వరుసగా సీజన్లు వస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఏడో సీజన్ మొదలైంది. ఇందులో మొదటి వారం ఊహించని ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. మరి ఈ వారం ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు? చూద్దామా!

ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఆసక్తిగా: బిగ్ బాస్ ఆరో చాలా చప్పగా సాగింది. దీంతో ఏడో దాన్ని సక్సెస్ చేయాలన్న లక్ష్యంతో ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్టును తీసుకు వచ్చారు. ఇందులో ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త టాస్కులు కూడా చూపిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి పెరిగిపోయిందని చెప్పొచ్చు.
14 మందే... మరికొందరితోనూ: ఏడో సీజన్‌లోకి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు వచ్చారు. వీరితో పాటు ఈ వీకెండ్‌లో మరికొందరు కూడా రాబోతున్నారట.
ఈ వారం 8 మంది నామినేట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి మొదటి వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయిన విషయం తెలిసిందే. వారిలో పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు హాట్‌స్టార్, మిస్‌డ్ కాల్స్‌తో ఒక్కో ఓట్ వేసే అవకాశమే ఉంది.

ఆ ఒక్కడికే 40 శాతం ఓటింగ్: తాజాగా ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ గత మంగళవారం రాత్రి నుంచి మొదలైంది. ఇది ఎవరూ ఊహించని రీతిలో జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా కామన్ మ్యాన్‌గా వచ్చిన పల్లవి ప్రశాంత్‌కే ఏకంగా 40 శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. ఇది బిగ్ బాస్‌కే దిమ్మతిరిగే ట్విస్ట్ అని బుల్లితెర వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
లోకల్ బ్యూటీని లేపేశారుగా: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌కు సంబంధించి ఓటింగ్ పూర్తయ్యే సమయానికి రెండో స్థానంలో లోకల్ బ్యూటీ రతికా రోజ్ ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి పోలింగ్ మొదలైన తర్వాత ఆమె నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని మూడో స్థానానికి చేరింది. అలా ఓటింగ్ ముగిసే సరికి ఏకంగా రెండో స్థానానికి వచ్చింది. దీంతో ప్రశాంత్, రతికా టాప్ 2లో సేఫ్ అయ్యారు.

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు: ఎన్నో అంచనాల నడుమ ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్ మొదటి వారంలో జరిగిన ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ టాప్ 2 స్థానాల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత మాత్రం వరుసగా శోభా శెట్టి మూడో స్థానంలో, గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో, షకీలా ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. అంటే మొదటి వారానికి గానూ వీళ్లందరూ దాదాపుగా సేఫ్ అయినట్లు చెప్పుకోవాలి.
ఈ వారం ఎలిమినేట్ ఎవరు?: మొదటి వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ ఆరో స్థానంలో ఉండగా.. దామిని ఏడో స్థానంలో.. కిరణ్ రాథోడ్ ఎనిమిదో స్థానంలో నిలిచి జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. అంటే వీళ్ల ముగ్గురిలోనే ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఎక్కువగా కిరణ్ రాథోడ్ వెళ్లిపోయే అవకాశం ఉంది. మరి ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఏదైనా కూడా జరగొచ్చు.


Click it and Unblock the Notifications











