Bigg Boss Elimination: ఈసారి నో ఎలిమినేషన్.. అందరూ సేఫ్ అవడానికి కారణం ఆ ఒక్కడే.. ఏం ట్విస్ట్ గురూ!

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠతో సాగుతూ.. దాదాపు 15 వారాల పాటు ప్రేక్షకులకు మజాను పంచుతోన్న షోనే బిగ్ బాస్. దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. దీనికి తెలుగులో మాత్రమే బీభత్సమైన స్పందన వస్తోంది. అందుకే ఇక్కడ వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నిర్వహకులు అదిరిపోయే కంటెంట్‌తో నడుపుతున్నారు. సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న ఇందులో 11వ వారం ఎలిమిషన్ తీసేసినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. దాని వెనుక అసలు కారణం ఏంటో మీరే చూసేయండి మరి!

Bigg Boss Telugu 7 Elimination

ట్విస్టులతో సాగుతోందిగా: బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న లక్ష్యంతో ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో గతంలో చూడని అంశాలను ప్రసారం చేయడంతో పాటు టాస్కుల్లోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ట్విస్టులు ఇస్తూ, సర్‌ప్రైజ్‌లు చేస్తూ ఈ సీజన్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. అదే సమయంలో రేటింగ్‌ను రాబడుతున్నారు.

ఎలిమినేట్ ఎవరయ్యారు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు, ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్‌, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారంలో భోలేలు బయటకు వెళ్లిపోయారు.

నామినేషన్‌లో ఎవరంటే: బిగ్ బాస్ ఏడో సీజన్‌ చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఫినాలే జరగబోతుంది. ఈ నేపథ్యంలో 11వ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా రంజుగా సాగింది. ఎన్నో గొడవలతో సాగిన ఈ నామినేషన్స్ టాస్కులో మొత్తంగా శోభా శెట్టి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేషన్‌లోకి వచ్చేశారు.

ఆ నలుగురికే తక్కువగా: ఏడో సీజన్‌లో 11వ వారానికి సంబంధించిన ఓటింగ్ ముగిసే సమయానికి అమర్‌దీప్ చౌదరి టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడని ఇప్పటికే చెప్పుకున్నాం. అతడి తర్వాత వరుసగా ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలు ఉన్నారని తెలిసింది. ఇక, మిగిలిన నలుగురు లేడీ కంటెస్టెంట్లలో ప్రియాంక ఐదు, రతికా ఆరు, శోభా శెట్టి ఏడు, అశ్విని ఎనిమిదో స్థానాల్లో నిలిచి డేంజర్ జోన్‌కు వెళ్లారు.

వాళ్లిద్దరిలో ఒకరు అంటూ: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 11వ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌ను బట్టి డేంజర్ జోన్‌లో నలుగురు లేడీస్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఈ వారంలో శోభా శెట్టి లేదా అశ్విని శ్రీలలో ఒకరు బయటకు వెళ్లిపోతారని రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో 11వ వారం ఎలిమినేషన్‌ విషయంలో అసలేం జరుగుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది.

No Elimination in 11th Week Because of Prince Yawar Eviction Pass

నో ఎలిమినేషన్ అని లీక్: బిగ్ బాస్ 11వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో ఎలిమినేషన్ తీసేశారు. ఇప్పటికే ఈ న్యూస్ బయటకు వచ్చేసింది. దీంతో డేంజర్ జోన్‌లో ఉన్న అశ్విని, శోభా శెట్టి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 7వ సీజన్ మొదలైన తర్వాత ఎలిమినేషన్ తీసేయడం ఇదే మొదటిసారి అన్న విషయం తెలిసిందే.

అతడి నిర్ణయమే కారణం: ఏడో సీజన్‌లో 11వ వారం ఎలిమినేషన్ తీసేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే సమయంలో ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రిన్స్ యావర్ తన ఎవిక్షన్ పాస్‌ను తిరిగి ఇచ్చేయడం వల్లే ఈ వారం ఎలిమినేషన్ తీసేశారని తెలిసింది. అలా అతడు తీసుకున్న నిర్ణయం ఎలిమినేషన్‌ను డిసైడ్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X