Bigg Boss 7 Voting: 7వ వారం ఓటింగ్‌లో ట్విస్ట్.. అతడు డేంజర్ జోన్‌లో.. ఈ సారి కూడా సేమ్ ఎలిమినేషన్?
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతోన్నా.. భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక రియాలిటీ షోనే బిగ్ బాస్. అంతలా ఇది ఏడేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షో అనిపించుకుంటోంది. దీంతో ఇప్పుడు ఏడో దానిని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో ముందుకు నడుపుతున్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్ ఇప్పుడు ఏడో వారానికి చేరుకుంది. మరి ఈ వారంలో ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? చూసేద్దాం పదండి!
విభిన్నమైన కాన్సెప్టుతోనే
బిగ్ బాస్ అంటేనే చాలు అది ఎలాంటి కంటెంట్‌తో సాగుతున్నా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటిది ఇప్పుడు జరుగుతున్న ఏడో సీజన్ ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులతో నడుస్తోంది. అంతేకాదు, ఇందులో టాస్కులు, నామినేషన్స్, ఓటింగ్, ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్స్ ఇలా అన్నీ చాలా కొత్తగానే సాగుతున్నాయని చెప్పాలి.

అందరూ వాళ్లే వెళ్లారుగా
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చారు. అలాగే, ఐదు వారాలు ముగిసిన తర్వాత మరో ఐదుగురు సెలెబ్రిటీలు సైతం వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి అడుగు పెట్టారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ పావనీలు ఎలిమినేట్ అయ్యారు.

ఈసారి 7గురు నామినేట్
బిగ్ బాస్ ఏడో సీజన్ ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో చూసిన కాన్సెప్టుతో జరిగింది. చాలా గొడవలతో సాగిన ఈ టాస్కును రెండు రోజులు ప్రసారం చేశారు. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ టాస్కులో ఏడుగురు కంటెస్టెంట్లు భోలే షావలి, అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, పూజా మూర్తి, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజలు నామినేట్ అయ్యారు.

ఓటింగ్ ట్విస్ట్.. రైతే టాప్
ఏడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఆరంభం నుంచే ఊహించని విధంగానే సాగుతోంది. ముఖ్యంగా ఈ వారంలో రోజులు గడుస్తున్న కొద్దీ పోలింగ్‌లో ట్విస్టులు కనిపిస్తున్నాయి. అయితే, కామన్ మ్యాన్‌గా వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం అత్యధిక ఓట్లను అందుకుంటూ టాప్‌లో ఉన్నాడు. అతడి తర్వాతి స్థానాల్లో మాత్రం చాలా మార్పులు వస్తున్నాయి.

తర్వాతి స్థానాల్లో ఎవరు?
ఏడో సీజన్ ఏడో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్ తర్వాత అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం ఎన్నో రకాల మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. మొదట్లో గౌతమ్ కృష్ణ మూడో స్థానంలో ఉండగా.. టేస్టీ తేజ అతడి స్థానంలోకి వచ్చేశాడు. దీంతో అశ్వద్దామా 2.O నాలుగో స్థానానికి పడిపోయాడు.
అతడు కూడా డేంజర్‌లో
ఏడో వారం ఓటింగ్ ప్రారంభం అయినప్పుడు భోలే షావలి నాలుగో స్థానంలో ఉన్నాడు. కానీ, క్రమంగా అతడి ఓటింగ్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సింగర్ ఐదో స్థానానికి పడిపోయాడట. ఆ తర్వాత పూజా మూర్తి, అశ్విని శ్రీలు ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నట్లు తెలిసింది. అంటే ప్రస్తుతానికి వీళ్లు ముగ్గురూ డేంజర్ జోన్‌లోనే ఉన్నారని చెప్పుకోవాలి.

మళ్లీ అదే ఎలిమినేషన్?
బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభమై ఇప్పటికి ఆరు వారాలు పూర్తయ్యాయి. అన్నింట్లోనూ లేడీ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో వారంలో కూడా ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్లు ఓటింగ్‌లో చివరి స్థానాల్లో కొనసాగుతున్నారు. దీంతో ఈ సారి కూడా లేడీనే ఎలిమినేట్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. కానీ, ఇది ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఏదైనా జరగొచ్చు.


Click it and Unblock the Notifications











