Bigg Boss 7 Voting: 7వ వారం ఊహించని ఓటింగ్.. వాళ్ల కంటే భోలేకే ఎక్కువగా.. డేంజర్ జోన్‌లో ఎవరంటే!
తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందడంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది బిగ్ బాస్. పేరుకు కొత్త షోనే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందనను ఇచ్చారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. మరి ఇందులో ఏడో వారానికి సంబంధించిన ఓటింగ్ ఎలా జరుగుతుంది అనే వివరాలను మీరే చూసేయండి మరి!
కొత్త కాన్సెప్టుతో వినోదంగా:సాధారణంగా వచ్చే బిగ్ బాస్ షోకే ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందిస్తున్నారు. అలాంటిది ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో సరికొత్తగా నడుస్తోన్న ఏడో సీజన్‌కు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో గతంలో ఎప్పుడూ చూడని ఎన్నో సంఘటనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఇది యమా వినోదాన్ని పంచుతూ సక్సెస్‌ఫుల్‌గానే సాగిపోతుందని చెప్పాలి.

ఆరుగురూ అమ్మాయిలేగా:ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అలాగే, ఐదు వారాలు ముగిసిన తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీలు వెళ్లిపోయారు.
7వ వారంలో ఏడుగురు:ఏడో సీజన్ ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కుండలు పగలగొట్టే కాన్సెప్టుతో జరిగింది. ఇందులో ఎన్నో గొడవలు కనిపించాయి. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ టాస్కులో ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో భోలే షావలి, అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, పూజా మూర్తి, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజలు ఉన్నారు.

షాకింగ్ ఓట్స్.. అతడిదే:ఏడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఆరంభం నుంచే ఊహించని విధంగానే సాగుతోంది. ముఖ్యంగా ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా మారిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు ప్రేక్షకులు అదిరిపోయే ఓటింగ్ నమోదు చేస్తున్నారు. దీంతో అతడి ఒక్కడికే 39 శాతం వరకూ పోలింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం మొత్తం అతడే టాప్‌లో కొనసాగే చాన్స్ కనిపిస్తోంది.
తర్వాతి స్థానాల్లో ఎవరు?:ఏడో సీజన్ ఏడో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో ప్రశాంత్ తర్వాత అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు కూడా తెలిసింది. అయితే వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం ఎన్నో రకాల మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పుడు మూడో స్థానంలో గౌతమ్ కృష్ణ, నాలుగో స్థానంలో భోలే షావలి, ఐదో స్థానంలో టేస్టీ తేజలు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.

డేంజర్ జోన్‌లో లేడీసే:ఏడో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో కొత్తగా వచ్చిన అమ్మాయి అశ్విని శ్రీ ఆరో స్థానానికి పడిపోయాడని తెలిసింది. అలాగే, పూజా మూర్తి ఏడో స్థానంలో ఉంది. అంటే ఈ వారంలో ప్రస్తుతానికి వీళ్లిద్దరే డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పాలి. వాస్తవానికి భోలే అందరి కంటే చివర్లో ఉంటాడని అనుకున్నా.. అతడికి ఊహించని విధంగా భారీ ఓటింగ్ నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











