Bigg Boss Elimination: 6వ వారం ఉల్టా పుల్టా ఓటింగ్.. టాప్ కంటెస్టెంట్‌కు షాక్.. ఈసారి ఆమె ఎలిమినేట్

ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభం అయినా.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడేళ్లుగా ఇది బుల్లితెరపై సంచలనాలను సృష్టిస్తూ.. భారీ స్థాయిలో రేటింగ్‌ను సాధిస్తూ.. సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తోంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది విజయవంతంగా నడుస్తోంది. ఇందులో ఆరో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ గురించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారో చూద్దాం పదండి!

Bigg Boss Teugu 7 Elimination

ట్విస్టుల మీద ట్విస్టులతో: సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్‌ను మరింత విజయవంతంగా నడిపేందుకు ఏడో సీజన్‌లో ఉల్టా పుల్టా అనే కాన్సెప్టును తీసుకు వచ్చారు. పేరుకు తగ్గట్లుగానే ఇందులో ఎవరూ ఊహించని, గతంలో చూడని కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి విషయంలోనూ ఎన్నో ట్విస్టులు ఇస్తున్నారు. తద్వారా ఈ సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు.

ఐదు వారాల్లోనూ లేడీసే: ఏడో సీజన్‌లోకి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు వచ్చారు. వీరిలో తొలి వారంలో కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారం శుభశ్రీలు ఎలిమినేట్ అయ్యారు.

6వ వారం వీళ్లే నామినేట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియను పోటుగాళ్లు, ఆటగాళ్లు అనే రెండు టీమ్‌లుగా విభజించి నిర్వహించారు. గత నామినేషన్స్‌తో పోల్చుకుంటే ఇందులో గొడవలు కాస్త తక్కువగానే జరిగాయి. ఇలా ఈ వారంలో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయనీ పావని నామినేషన్‌లోకి వచ్చారు.

Bigg Boss Telugu 7 Elimination

అతడికే ఎక్కువ ఓటింగ్: ఆరో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఆరంభం నుంచే ఏకపక్షంగా సాగినట్లు తెలిసింది. శివాజి, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల స్నేహితుడైన ప్రిన్స్ యావర్‌కే అభిమానులు జై కొట్టారు. దీంతో అతడి ఒక్కడికే దాదాపు 30 శాతం వరకూ పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. దీనికితోడు కెప్టెన్‌ అవడంతో ఇమ్యూనిటీని కూడా అందుకున్నాడు.

వాళ్లంతా సేఫ్ అయ్యారు: ఏడో సీజన్ ఆరో వారంలో పూర్తైన ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ తర్వాత అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో నిలిచినట్లు కూడా తెలిసింది. అయితే వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం చాలా రకాల మార్పులు మాత్రం వచ్చాయి. ఇలా ఓటింగ్ పూర్తయ్యే సరికి మూడో స్థానంలో టేస్టీ తేజ, నాలుగో స్థానంలో నయనీ పావని ఉన్నారట. అంటే ఈ వారం వీళ్లంతా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఆ ముగ్గురు డేంజర్‌లోనే: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని ఆరో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో చివరి మూడు స్థానాల్లో మాత్రం చాలా అంటే చాలా మార్పులే కనిపించినట్లు తెలిసింది. ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్‌గా పేరొందిన శోభా శెట్టి చివరి స్థానంలో ఉంది. ఆమె కంటే ముందు అశ్విని శ్రీ, పూజా మూర్తిలు ఉన్నారు. ఫలితంగా ఈ ముగ్గురిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు.

Pooja Murthy Or Shobha Shetty Or Aswini Will Eliminate in 6th Week

మొత్తంగా ఆమె బయటకు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పటి వరకూ ఎప్పుడూ జరగని విధంగా మొదటి ఐదు వారాల్లోనూ ఐదుగురు లేడీ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఆరో వారంలోనూ ముగ్గురు లేడీ కంటెస్టెంట్లే డేంజర్ జోన్‌లో ఉన్నారు. అంటే.. ఈ వారం కూడా మరో అమ్మాయే ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈ వారం కూడా 'ఆమె'నే వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X