Bigg Boss Elimination: 7వ వారం ఓటింగ్‌లో సంచలనం.. తొలిసారి ఇద్దరు మగాళ్లు.. ఈసారి ఎలిమినేట్ ఎవరంటే!
తెలుగు బుల్లితెరపై సెన్సేషన్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. దేశంలోనే టాప్ రేటింగ్‌తో నెంబర్ వన్ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. అంతేకాదు, ఎప్పటికప్పుడూ భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సీజన్లను ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. ఇందులో ఏడో వారం ఓటింగ్‌లో ఊహించని పరిణామాలు జరిగినట్లు తెలిసింది. మరి ఈసారి డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు? చూద్దామా!
పేరుకు తగ్గ కంటెంట్‌తోనే : బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎవరూ ఊహించని అంశాలతో ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో టాస్కుల్లో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. దీనికితోడు మిగిలిన అన్ని అంశాల్లోనూ కొత్తదనం కనిపిస్తోంది. ఫలితంగా దీనికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ సీజన్ రంజుగానే సాగిపోతుంది.

లేడీస్‌నే పంపించేశారుగా : బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టారు. వారిలో ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా, ఐదో వారంలో శుభశ్రీలు ఎలిమినేట్ అయ్యారు. అలాగే, ఐదు వారాలు ముగిసిన తర్వాత మరో ఐదుగురు సెలెబ్రిటీలు సైతం వచ్చారు. వీరి నుంచి ఆరో వారం నయనీ పావనీలు ఎలిమినేట్ అయింది.
ఏడో వారంలో ఎక్కువగా : ఏడో సీజన్‌లో ఎలిమినేషన్లు అన్నీ ఊహించని విధంగా సాగుతున్నాయి. ఇందులో ఎక్కువగా లేడీ కంటెస్టెంట్లే వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏడో వారం జరిగిన నామినేషన్స్ టాస్కులో గతంలో ఎన్నడూ లేని విధంగా మేల్ కంటెస్టెంట్లు ఎక్కువ నామినేట్ అయ్యారు. మొత్తంగా ఈ వారం భోలే షావలి, అశ్విని, ప్రశాంత్, అమర్‌దీప్, పూజా మూర్తి, గౌతమ్, తేజలు ఉన్నారు.
అతడే టాప్.. ట్విస్టులతో : బిగ్ బాస్ ఏడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొత్తం విభిన్నంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ భారీ ఓటింగ్‌ను నమోదు చేసుకున్నాడు. అతడు ఒక్కడికే దాదాపు 35 శాతం ఓటింగ్ వచ్చింది. అయితే, ఆ తర్వాత స్థానాల్లో మాత్రం మొదటి రోజు నుంచీ ఎన్నో మార్పులు కనిపించాయి. దీంతో ఈ ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది.
ఎవరు ఏ స్థానంలో అంటే : ఏడో వారానికి గానూ జరిగిన ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి పల్లవి ప్రశాంత్ తర్వాత అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో నిలిచినట్లు తెలిసింది. వీళ్లిద్దరి తర్వాత కంటెస్టెంట్లకు చాలా అంటే చాలా తక్కువ ఓట్లే నమోదు అయినట్లు సమాచారం. అంటే గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, భోలే షావలి, పూజా మూర్తి, అశ్వినీ శ్రీలకు మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











