Bigg Boss Telugu 7 Elimination టాప్ 5 కంటెస్టెంట్‌ ఆశలపై రంగు జల్లిన రవితేజ.. మాస్ మహారాజ్ చేతిలో ఎలిమినేషన్

గ్రాండ్‌గా జరిగిన బిగ్‌బాస్ తెలుగు 7 ఫినాలేలో ఎలిమినేషన్ ప్రక్రియ ఊహించినట్టే జరుగుతున్నది. ఫినాలేలో భాగంగా జరిగిన ఎలిమినేషన్‌లో ఇంటి నుంచి అంబటి అర్జున్ బయటకు వచ్చారు. దాంతో టైటిల్ పోటీ ఐదుగురికి చేరింది. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, యావర్, ప్రియాంక జైన్ మిగిలారు. అయితే ఈ సీజన్‌లోనైనా లేడి కంటెస్టెంట్ టైటిల్ గెలుస్తుందా? అనే ఆశలపై రవితేజ నీళ్లు జల్లారు. ఆ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి బరిలో దిగుతున్న ఈగల్ సినిమా ప్రమోషన్స్ కోసం రవితేజ మరోమారు బిగ్‌బాస్ వేదికపైన హోస్ట్ నాగార్జునతో జతకలిశారు. సంక్రాంతి పోటీలో నా సామిరంగ, ఈగిల్ సినిమా సక్సెస్ కావాలని ఇద్దరు ఒకరికొకరు విషెస్ తెలియజేసుకొన్నారు. ఆ తర్వాత ఎలిమినేషన్ బాధ్యతను రవితేజ చేతిలో పెట్టారు.

Bigg Boss Telugu 7 Elimination: Priyanka Jain eliminated in hands of Ravi Teja

బిగ్‌బాస్ టాప్ 5 ఎలిమినేషన్‌‌ను రవితేజకు అప్పగిస్తూ.. నేను నాచేతికి ఏది అంటించుకోను. కాబట్టి నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పారు. వేదికపై వైట్ బోర్టును పెట్టి రంగు చల్లాలి. ఆ తర్వాత ఎవరి బొమ్మ వస్తే.. వారు ఎలిమినేట్ అవుతారు అని నాగార్జున చెప్పారు. దాంతో రవితేజ రంగు చల్లితే ప్రియాంక బొమ్మ వచ్చింది. దాంతో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యారనే విషయాన్ని నాగ్ ప్రకటించారు.

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులకు ప్రియాంక జైన్ గుడ్ బై చెప్పారు. దాంతో ఇంటి నుంచి అసంతృప్తితో బయటకు వచ్చారు. ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ విజేతగా నిలువాలనే కోరిక తీరకుండానే మరోకరు ఎలిమినేట్ అయ్యారు. ఆమె వేదికపైన నాగార్జునను కలిసి మాజీ కంటెస్టెంట్లతో కలిసి కూర్చొన్నారు.

అయితే బిగ్‌బాస్ తెలుగు 7 వేదికపై నుంచి రవితేజ వెళ్తూ.. ఒక ఆడపిల్లను ఎలిమినేట్ చేయడం బాధగా ఉంది అని అన్నారు. దాంతో ఇదంతా ఆటలో భాగం అంటూ నాగార్జున చెప్పారు. అలా ప్రియాంక జైన్ జర్నీ బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X