Bigg Boss 7 Voting: ఓటింగ్‌లో సంచలనం.. టాప్‌లో ఊహించని ప్లేయర్.. ఎలిమినేషన్ ప్రమాదంలో టైటిల్ ఫేవరెట్
సాధారణంగా బుల్లితెరపై కొత్త కంటెంట్‌తో వచ్చిన ఏ షో అయినా ప్రేక్షకుల ఆదరణను అందుకోవడం కష్టం. అలాంటిది అస్సలు పరిచయమే లేని కాన్సెప్టుతో వచ్చినా.. తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్ అయిందే బిగ్ బాస్. తెలుగులో వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోన్న ఇది.. దేశంలోనే టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది.
ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇటీవలే ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇందులో నాలుగో వారంలో ఎలిమినేషన్ కోసం జరిగే ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇంతకీ ఈ వారం ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో మీరే చూసేయండి మరి!

ఫుల్ ఉల్టా పుల్టా కంటెంట్‌తో: తెలుగులో బిగ్ బాస్ షో ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను జరుపుకోవడంతో.. ఏడో దానిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. దీంతో ఈ సారి ఉల్టా పుల్టా సీజన్‌తో వినోదాన్ని ఇస్తామంటూ నిర్వహకులు ముందే తెలిపారు. అందుకు అనుగుణంగానే అన్ని సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తూ షోను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు.
ముగ్గురు లేడీస్ ఎలిమినేట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని వెళ్లిపోయారు.
4వ వారం 6 గురు నామినేట్: ఏడో సీజన్ నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ సరికొత్త కాన్సెప్టుతో ఎన్నో గొడవలతో రంజుగానే సాగింది. ఇందులో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక, రతికా రోజ్, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజలు ఉన్నారు. వాస్తవానికి తేజ నామినేషన్స్‌లో లేకున్నా శివాజి, సందీప్, శోభాలు నామినేట్ చేశారు.

ఓటింగ్‌లో సంచలనంగా: నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇందులో కొందరు భారీ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ.. ఈ షో ద్వారానే వెలుగులోకి వచ్చిన ప్రిన్స్ యావర్ ఎక్కువ ఓట్లు సాధిస్తున్నట్లు తెలిసింది. అతడు ఒక్కడికే దాదాపు 30 శాతం వరకూ ఓటింగ్ నమోదు అవుతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.
ఎవరు ఏ స్థానంలో అంటే: ఏడో సీజన్ నాలుగో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ తర్వాత శుభశ్రీ రాయగురు రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు కూడా తెలిసింది. అయితే వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం ఎన్నో రకాల మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పుడు మూడో స్థానంలో గౌతమ్ కృష్ణ, నాలుగో స్థానంలో ప్రియాంక జైన్‌లు ఉన్నారు. వీళ్లంతా దాదాపుగా సేఫ్ అయినట్లు చెప్పుకోవాలి.

డేంజర్ జోన్‌లో ఎవరంటే?: నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో టేస్టీ తేజ్ ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. రతికా రోజ్ ఏకంగా ఆరో స్థానానికి పడిపోయిందని తెలిసింది. షోలోకి వచ్చిన కొద్ది రోజులకే టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం ఎలిమినేషన్ ప్రమాదంలో ఉంది. అయితే, ఓటింగ్‌కు ఇంకా రెండో రోజులు ఉండడంతో ఏదైనా జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











