Bigg Boss 7 Voting: 10వ వారం సంచలన ఓటింగ్.. టాప్ ప్లేయర్‌కు బిగ్ షాక్.. ఈసారి ఎవరు వెళ్లిపోతారంటే!
విభిన్నమైన కాన్సెప్టుతో తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అవుతోన్న షోనే బిగ్ బాస్. ఎన్నో అనుమానాలతోనే ప్రారంభం అయిన ఈ షో.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సక్సెస్ అయింది. ఫలితంగా ప్రతి ఏడాది ఒక సీజన్ చొప్పున ప్రసారం అవుతూనే ఉన్నాయి.
ఇలా ఇటీవలే ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇందులో ఎవరూ ఊహించని కంటెంట్‌ను ప్రసారం చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. అయితే, ఎలిమినేషన్స్ మాత్రం షాకింగ్‌గా జరుగుతున్నాయి. మరి ఈ వారం ఓటింగ్ ఎలా జరుగుతుందో చూద్దామా!

ఎప్పుడు ఏం జరుగుతుందో: సాధారణంగా బిగ్ బాస్ షో ఆరంభంలో కొత్తగా ఉన్నా.. క్రమంగా ఇది ఎలా సాగుతుందో అందరికీ అవగాహన వచ్చేస్తుంది. అయితే, ఏడో సీజన్ మాత్రం అందుకు భిన్నంగా ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోంది. ఇందులో ఊహకే అందని కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తున్నారు. అదే సమయంలో రేటింగ్‌ను కూడా భారీగా రాబడుతూ షోను సక్సెస్ చేస్తున్నారు.
ఎవరెవరు వెళ్లిపోయారంటే: ఏడో సీజన్‌లోకి ముందుగా 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా, ఎనిమిదో వారం సందీప్, తొమ్మిదో వారంలో టేస్టీ తేజలు ఎలిమినేట్ అయ్యారు.
పదో వారంలో ఐదుగురు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో నామినేషన్ ప్రక్రియలు అన్నీ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. దీనికి కారణం వీటిలో ఎక్కువ గొడవలు జరుగుతుండడమే. అందుకు భిన్నంగా పదో వారం ప్రక్రియ చాలా చప్పగా సాగిపోయింది. రాజమాతలు, ప్రజల కాన్సెప్టుతో నడిచిన ఈ టాస్కులో మొత్తంగా భోలే షావలి, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శివాజి, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు.
ఓటింగ్ భారీగా.. శివాజినే: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. ఈ సారి నామినేషన్స్‌లో తక్కువ మందే ఉండడంతో పోలింగ్ భారీగా జరుగుతున్నట్లు తెలిసింది. ఇక, ఈ వారంలో టైటిల్ ఫేవరెట్ శివాజీకే ఎక్కువ ఓటింగ్ నమోదు అవుతోంది. అతడు ఒక్కడికే దాదాపు 35 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తున్నాయని సమాచారం.

మిగిలిన స్థానాల్లో ఎవరు?: పదో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో శివాజి టాప్ పొజిషన్‌లో కొనసాగుతూ ఉండగా.. మిగిలిన అన్ని స్థానాల్లోనూ ఎన్నో రకాల మార్పులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం మాత్రం రెండో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నట్లు తెలిసింది. అలాగే, ఇప్పుడు ట్రెండ్‌ను బట్టి మూడో స్థానంలో భోలే షావలి ఉన్నాడని ఓ షాకింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

అతడు డేంజర్ జోన్‌లో: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని పదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో రతికా రోజ్ మొదటి నుంచీ చివరి స్థానంలోనే కొనసాగుతున్నట్లు తెలిసింది. అయితే, ఊహించని విధంగా ఈ వీక్ స్టార్టింగ్‌లో డీసెంట్ ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్న ప్రిన్స్ యావర్ ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయాడని అంటున్నారు. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారన్న మాట.

అతడు తప్ప అందరూ: ఇప్పటి వరకూ చూసిన ఓటింగ్ సరళి ప్రకారం.. పదో వారంలో ఒక్క శివాజి మినహా మిగిలిన వాళ్లంతా డేంజర్ జోన్‌లోనే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే రెండో స్థానంలో ఉన్న ప్రిన్స్ యావర్‌కు, చివరి స్థానంలో ఉన్న రతికా రోజ్‌కు ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. దీనిబట్టే ఈ స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వారంలో రతికానే వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications











