Bigg Boss Telugu 7: ఒక్కసారిగా ఉల్టా పుల్టాగా ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఈసారి డబుల్ ఎలిమినేషన్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే ఆసక్తిగా సాగుతోంది. ఇక 11వ వారం కూడా పూర్తి కావొస్తుంది. గత వారం బోలే షవాలి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ముగియనుంది. ఓటింగ్ ప్రక్రియ ముగియనుండటంతో.. పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు అవుతుంది. నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు.. టాప్ లో ఎవరు ఉన్నారు... ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇప్పుడు ఏ నలుగురు కలిసినా.. బిగ్ బాస్ ముచ్చటే.. ఏ సోషల్ మీడియో ఓపెన్ చేసినా.. బిగ్ బాస్ వీడియోలు, మీమ్స్. అంతలా జనాల్లోకి పాకింది ఈ షో. అత్యధిక ప్రేక్షకాదరణతో ఈ షో 11వారాలుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో పది మంది ఉన్నారు.. అందులో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. గత వారం బోలే షవాలి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్స్ ఫైర్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లో రతికా రోజ్, శోభా శెట్టి, అశ్విని శ్రీ ఎలిమినేట్ కావాలని గత కొంతకాలంగా నెటిజన్స్ చూస్తున్నారు. కానీ వారిని బిగ్ బాస్ కాపాడుతూ వస్తున్నాడు. ఇక బిగ్ బాస్ ముద్దు బిడ్డ రతికా రోజ్ కు అయితే ఎన్నో సార్లు బిగ్ బాస్ అవకాశాలు కల్పించాడు. ఆమె ఎలిమినేట్ అయినప్పుడు.. హమ్మాయ్యా అని నెటిజన్స్ అనుకున్నారు. ఇక మళ్లీ రీ ఎంట్రీ పేరుతో బిగ్ బాస్ ఆమెకు అవకాశం కల్పించి ఇంట్లో పెట్టాడు.
ఇక రతికా రోజ్.. ఆ మధ్య ఫ్యామిలీవీక్ తర్వాత మరింత రెచ్చిపోయింది. ఇక నామినేషన్స్ లో పూనకం వచ్చినట్లే చేసింది. ఇక ఈమె గేమ్ ఆడింది లేదు.. ఉండి దండగ అని నెటిజన్స్ అనుకుంటున్నారు. కానీ ప్రతి సారి రతికా రోజ్ ను, శోభా శెట్టిని, అశ్వినీ శ్రీలను కాపాడుకుంటూ వస్తున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే.. వీళ్లు ఎలిమినేట్ అయిపోతే..హౌస్ లో ఎక్కువ మొత్తంలో మేల్ కంటెస్టెంట్స్ ఉంటారు. అలా ఫీమేల్ కంటెస్టెంట్స్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు బిగ్ బాస్.

ఇక ఈ వారం నామినేషన్స్ లో 8మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ కెప్టెన్ కాగా.. ప్రశాంత్ ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. ఇక ఈ వారం అమర్ దీప్, గౌతమ్, అశ్విని శ్రీ, శోభాశెట్టి, ప్రియాంక జైన్, రతికా రోజ్, యావర్, అర్జున్ అంబటి ఉన్నారు. వీరిలో టాప్ లో మాత్రం యావర్ మొదటి స్థానంలో ఉన్నాడు. యావర్ కు 34శాతం ఓట్లతో టాప్ లో ఉన్నాడు. ఇక ఆ తర్వాతి స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. 19శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక మూడో స్థానంలో గౌతమ్ 12 శాతం ఓట్లు, అశ్విని శ్రీ 8 శాతం ఓట్లు పడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రియాంక 7 శాతం ఓట్లు, అర్జున్ 6.5 శాతం ఓట్లు, శోభా శెట్టి 5, రతికా రోజ్ 5 శాతం ఓట్లు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. డేంజర్ జోన్ లో శోభా శెట్టి, రతికా ఉన్నారు. ఇంకా మిగిలింది 3 గంటలే కాబట్టి.. ఏమైనా జరగొచ్చు... ఈవారం మాత్రం శోభా శెట్టి, రతికా రోజ్ ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు చూడాలి మరి.


Click it and Unblock the Notifications











