Bigg Boss Telugu 7: ఉల్టా పుల్టాగా మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ముద్దు బిడ్డ.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇక 11వ వారం కూడా విజయ వంతంగా పూర్తి చేసుకోబోతుంది. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షో.. చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతానికి హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. నిన్నటి వరకు ఓటింగ్ ఒకలా ఉంటే.. నేటికి ఉల్టా పుల్టాగా మారిపోయింది. దీంతో బిగ్ బాస్ ముద్దు బిడ్డ డేంజర్ జోన్ లోకి అడుగుపెట్టింది. ఈ వారం ఆమెనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి.. కొనసాగుతూ వస్తుంది. ఇక మరో ఐదు వారాల్లో ఈ షో ముగియనుంది. ఇక రోజు రోజుకు ఆసక్తికరంగా మారింది ఈ రియాలిటీ షో. మొదటి విడుతలో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఐదో వారంలో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయ్యారు. ఇక ఎప్పుడైతే వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చాయో.. షో మరింత రంజుగా మారిపోయింది. గోడవలు, తిట్లు, ఏడుపులతో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

 Bigg Boss Telugu 7 Elimination

ఇక ఎట్టకేలకు 10వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక 11వ వారం కూడా పూర్తి కావొస్తుంది. ఇప్పటి వరకు హౌస్ నుంచి 10 మంది ఎలిమినేట్ అయిపోయారు. షకీలా, కిరణ్ రాథోడ్, రతికా రోజ్, శుభ శ్రీ, దామిని, నయని పవని, పూజా మూర్తి, టేస్టీ తేజ, సందీప్, బోలే షవాలి ఇలా.. పది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఇక రతికా రోజ్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం హౌస్ లో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, గౌతమ్, అర్జున్ అంబటి, అశ్విని శ్రీ, రతికా రోజ్ ఉన్నారు. ఇక వీరు నువ్వా నేనా అన్నట్లుగా ఆడుతున్నారు. ఈ వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రశాంత్, శివాజీ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ఇక శివాజీ హౌస్ కు కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ లోకి రాలేదు. పల్లవి ప్రశాంత్ కూడా నామినేషన్స్ లోకి రాలేదు.

Rathika Rose and Shobha Shetty Entered into Danger Zone in 11th Week

ఇక ప్రతి సీజన్ లో లాగానే ఈ సీజన్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్కులు పెట్టాడు బిగ్ బాస్. ఈ సారి ఈ ఎవిక్షన్ పాస్ ను యావర్ గెలుచుకున్నాడు. ఇక హౌస్ లో నామినేషన్స్ లో ఉన్న 8 మంది కంటెస్టెంట్స్ లో అమర్ దీప్ టాప్ పొజిషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో యావర్, అర్జున్ నిలిచారు. ఇక వీరు టాప్ లో ఉండగా... డేంజర్ జోన్ ల మాత్రం బిగ్ బాస్ ముద్దు బిడ్డ చేరిపోయింది.

Rathika Rose and Shobha Shetty Entered into Danger Zone in 11th Week

ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాంక, అశ్విని శ్రీ లు చేరారు. అయితే డేంజర్ జోన్ లో శోభా శెట్టి, రతికా రోజ్ ఉన్నారు. బిగ్ బాస్ ఎన్నో సార్లు శోభాశెట్టిని, రతికా రోజ్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి ఈ సారి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. మరి యావర్ రతికా కోసం ఎవిక్షన్ ప్రీ పాస్ వాడితే.. ఆమె సెఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి యావర్ వాడుతాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X