Bigg Boss 7 Elimination: బిగ్ బాసే షాకయ్యే ఓటింగ్.. 4వ వారం సంచలన ఎలిమినేషన్.. అలా కూడా జరగొచ్చట
తెలుగు బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల నుంచి మద్దతును కూడగట్టుకుని సూపర్ హిట్ షోగా దూసుకెళ్తోంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు తీసుకు రావడంతో పాటు కంటెస్టెంట్ల మధ్య గొడవలతో పాటు రకరకాల ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ నిర్వహకులు షోను మరింత రంజుగా నడిపిస్తున్నారు.
ఇలా ఇప్పటికే చాలా సీజన్లను కూడా పూర్తి చేశారు. దీంతో ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, నాలుగో వారం జరగనున్న ఎలిమినేషన్ సంచలనంగా ఉండబోతుందట. ఆ వివరాలు మీరే చూడండి!

అంచనాలకు తగ్గట్లుగానే షో: ముందు నుంచీ నిర్వహకులు హైప్ ఎక్కించడంతో బిగ్ బాస్ ఏడో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి. దీంతో ఈ సారి ఉల్టా పుల్టా సీజన్‌తో వినోదాన్ని ఇస్తామంటూ నిర్వహకులు ముందే తెలిపారు. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తూ షోను విజయవంతంగా రన్ చేస్తున్నారు. అలాగే, రేటింగ్‌ను కూడా రాబడుతున్నారు.
ఎవరు ఎలిమినేట్ అయ్యారు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి నటి రతికా రోజ్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి మూడు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామినిలు ఎలిమినేట్ అయిపోయారు.

4వ వారం 6 గురు నామినేట్: బిగ్ బాస్ ఏడో సీజన్ నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కోర్టు రూమ్ డ్రామ్‌తో నడిపించారు. ఇందులో ఐదు రౌండ్లు జరగ్గా ఐదుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక, రతికా రోజ్, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణలు ఉన్నారు. శివాజి, సందీప్, శోభాలు తమకున్న స్పెషల్ పవర్‌తో టేస్టీ తేజను కూడా నామినేట్ చేసేశారు.
చిన్న కంటెస్టెంట్ టాప్‌లో: నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఆరంభం నుంచే సంచలనాత్మకంగా జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా ఇందులో కొందరు మంచి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ.. ఇందులోకి వచ్చిన తర్వాతనే గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ యావర్ ఎక్కువ ఓట్లు సాధించిన్నట్లు తెలిసింది. ఇలా వారం మొత్తం అతడే టాప్‌లో కొనసాగినట్లు బిగ్ బాస్ వర్గాల సమాచారం.
తర్వాత ఎవరు ఉన్నారంటే: తాజా సీజన్‌లో నాలుగో వారంలో జరిగిన ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ తర్వాత గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో నిలిచినట్లు తెలిసింది. అయితే వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం ఎన్నో రకాల మార్పులు మాత్రం కనిపించాయి. ఓటింగ్ ముగిసే సమయానికి మూడో స్థానంలో శుభశ్రీ, నాలుగో స్థానంలో ప్రియాంక జైన్‌లు ఉన్నారు. వీళ్లంతా ఈ వారం సేఫ్ అయ్యారని చెప్పుకోవచ్చు.

వాళ్లిద్దరిలో ఒకరు బయటకు: నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో అతి తక్కువ ఓట్లను సాధించిన టేస్టీ తేజ్ ఐదో స్థానంలో నిలవగా.. అతడి కంటే దారుణంగా రతికా రోజ్ ఆరో స్థానానికి పడిపోయింది. దీంతో ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. రతికాకు తక్కువ ఓటింగ్ వచ్చినా ఎక్కువ శాతం ఆమెను కాపాడే ప్రయత్నాలే జరిగే ఆస్కారం కూడా ఉంది.

డబులా? నో ఎలిమినేషనా?: ఈ వారం ఓటింగ్ ముగిసినప్పటి నుంచి ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టేస్టీ తేజ, రతికా రోజ్ ఇద్దరూ బయటకు వెళ్లిపోతారని అంటున్నారు. అయితే, వీళ్లిద్దరూ కంటెంట్ ఇచ్చే వాళ్లే కావడంతో బిగ్ బాస్ వేరేగా ఆలోచించే అవకాశం కూడా ఉంది. అంటే ఈ వారం ఎలిమినేషన్ తీసేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.


Click it and Unblock the Notifications











