Bigg Boss Elimination: 10వ వారం వీక్ కంటెస్టెంట్ సేఫ్.. ఒక్కరోజులోనే అతడు డౌన్.. ఎలిమినేట్ ఎవరంటే!
అంతకు ముందెన్నడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో నడుస్తున్నా.. ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుని.. తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షోనే బిగ్ బాస్. ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్టులతో నడుస్తున్నా దీనికి స్పందన భారీగానే పెరుగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇది మాత్రం గతంలో వాటికంటే ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు తగ్గట్లే ఇందులో ఎలిమినేషన్స్ మాత్రం ట్విస్టులతో సాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో పదో వారం ఎలిమినేషన్‌లో ఏం జరగబోతుందో చూద్దాం పదండి!

ఊహించని విధంగా సాగుతూ: ఆరంభంలో ఉన్న విధంగా కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ ఏమంత ఆసక్తికరంగా సాగడం లేదు. ఇది ఊహకు అందేలానే నడుస్తోంది. అయితే, ఏడో సీజన్ మాత్రం ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ప్రేక్షకులు అస్సలు ఆలోచించలేని ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఫలితంగా ఈ సీజన్ భారీ స్పందనను అందుకుని సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది.
9 వారాల్లో ఎవరు వెళ్లారంటే: ఏడో సీజన్‌లోకి ఆరంభంలో 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా, ఎనిమిదో వారం సందీప్, తొమ్మిదో వారంలో టేస్టీ తేజలు ఎలిమినేట్ అయిపోయారు.
10 వారంలో తక్కువ మందే: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియలు అన్నీ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. దీనికి కారణం వీటిలో ఎక్కువ గొడవలు జరుగుతుండడమే. అందుకు భిన్నంగా పదో వారం ప్రక్రియ చాలా చప్పగా సాగింది. రాజమాతలు, ప్రజల కాన్సెప్టుతో నడిచిన ఈ టాస్కులో మొత్తంగా భోలే షావలి, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శివాజి, గౌతమ్ కృష్ణలు నామినేషన్‌లోకి వచ్చారు.
ఓటింగ్ భారీగానే.. అతడిదే: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పదో వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో చాలా తక్కువ మందే ఉండడంతో వేరే కంటెస్టెంట్ల ఫ్యాన్స్ కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఈ సారి ఐదుగురికే ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా ఈ వారంలో టైటిల్ ఫేవరెట్ శివాజీకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందట. అతడు ఒక్కడికే దాదాపు 35 శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగినట్లు టాక్.

వీక్ ప్లేయర్ కూడా సేఫ్‌గానే: పదో వారానికి జరిగిన ఓటింగ్‌లో శివాజి టాప్ పొజిషన్‌లో నిలవగా.. మిగిలిన అన్ని స్థానాల్లో ఊహించని విధంగా ఎన్నో రకాల మార్పులు వచ్చినట్లు తెలిసింది. పోలింగ్ పూర్తయ్యే సరికి ప్రిన్స్ యావర్ రెండో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. అలాగే, వీక్ కంటెస్టెంట్‌గా ముద్ర పడినా.. పద్దతిగా ఉంటూ మెప్పిస్తున్న భోలే షావలి మాత్రం మూడో స్థానంలో నిలిచారని సమాచారం.
ఒక్క ఎపిసోడ్.. డేంజర్‌లోనే: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని పదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో రతికా రోజ్ మొదటి నుంచీ చివరి స్థానంలోనే ఉన్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. అయితే, ఊహించని విధంగా ఈ వీక్ స్టార్టింగ్‌లో డీసెంట్ ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయాడని అంటున్నారు. శివాజితో గొడవ కారణంగానే అతడికి ఓటింగ్ తగ్గిందని తెలిసింది.

ఎలిమినేట్ అయ్యేది తనే: పదో వారానికి గానూ జరిగిన ఓటింగ్ సరళి ప్రకారం.. ముందు నుంచీ చివరి స్థానంలోనే ఉన్న రతికా రోజ్ ఎలిమినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. బిగ్ బాస్ ఉల్టా పుల్టా నిర్ణయంతో మరోసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది. దీంతో ప్రేక్షకులు రతికా రోజ్‌కు ఓట్లు పెద్దగా వేయడం లేదు. దీంతో ఈ వారం ఆమె వందకు వంద శాతం వెళ్లిపోబోతుంది.


Click it and Unblock the Notifications











