Bigg Boss Elimination: అఫీషియల్ ఓటింగ్ లీక్.. 14వ వారం దిమ్మతిరిగే ఎలిమినేషన్.. శివాజికి బిగ్ షాక్

పాశ్చత్య సంస్కృతికి అద్దం పట్టే కాన్సెప్టుతో వచ్చినా.. ఊహకే అందని విధంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్న షోనే బిగ్ బాస్. అంతలా ఇది అన్ని భాషల్లోనూ సక్సెస్‌ను సాధించింది. ముఖ్యంగా తెలుగులో ఈ షో మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో బ్రేక్ లేకుండా సీజన్లను తీసుకు వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని రసవత్తరంగా నడుపుతున్నారు. ఇందులో 14వ వారానికి సంబంధించిన అఫీషియల్ ఓటింగ్ తాజాగా బయటకు వచ్చింది. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దామా!

ఆ సీజన్ల కంటే భారీగానే:బిగ్ బాస్ ఏడో సీజన్‌ కాన్సెప్టు వచ్చినప్పటి నుంచే దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎవరూ ఊహించిన విధంగా నడుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో గత సీజన్లలో కంటే రెట్టించిన వినోదాన్ని పంచుతున్నారు. ఇందుకోసం ట్విస్టులు, షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. దీంతో ఈ ఉల్టా పుల్టా సీజన్ గత సీజన్ల కంటే ఎక్కువ రేటింగ్ తెచ్చుకుంటోంది.

Bigg Boss Telugu 7 Elimination: Shobha, Priyanka and Prince Yawar Danger Zone in 14th Week

ఎలిమినేటైంది ఎవరు?:ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంటరయ్యారు. వీరిలో ఫస్ట్ వీక్ కిరణ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతిక, 13వ వారం గౌతమ్‌లు ఎలిమినేటయ్యారు.

ఈ నామినేషన్స్ అలా:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో నామినేషన్స్ ప్రక్రియ గతంలో వాటికంటే రంజుగా సాగుతోన్నాయి. దీనికి కారణం ఈ సీజన్‌లో ఎక్కువగా గొడవలు జరుగుతుండడమే అని చెప్పాలి. ఇక, ఫినాలే ముందు 14వ వారానికి సంబంధించిన ప్రక్రియ అదే మాదిరిగా సాగింది. ఈ టాస్కులో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టిలు నామినేట్ అయిపోయారు.

Bigg Boss Telugu 7 Elimination: Shobha, Priyanka and Prince Yawar Danger Zone in 14th Week

రెండు వారాల ముందే:సాధారణంగా బిగ్ బాస్ షోలో విన్నర్‌ను డిసైడ్ చేసే ఓటింగ్ 15వ వారంలోనే మొదలు అవుతుంది. కానీ, ఉల్టా పుల్టాగా జరుగుతోన్న ఏడో సీజన్‌లో మాత్రం దీన్ని 14వ వారం నుంచే తీసుకు వచ్చారు. ఇందులో డేంజర్‌ జోన్‌లో ఉన్న వాళ్లు ఎలిమినేట్ అవుతారు. మిగిలిన వాళ్లు మాత్రం ఫినాలేకు చేరుకుంటారు. అందుకే ఫైనల్ అస్త్ర గెలిచిన అర్జున్‌ను కూడా ఓటింగ్‌లో చేర్చారు.

మారిపోయిన టాప్ 3:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 14వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో శివాజి బ్యాచ్ ఆరంభం నుంచీ ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చింది. మొదటి రోజు నుంచే ఇందులో కామన్ మ్యాన్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్‌లో ఉన్నాడు. అంతేకాదు, అతడి తర్వాత స్థానంలో శివాజి కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నాడు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. అమర్‌ 3లోకి వచ్చాడు.

Bigg Boss Telugu 7 Elimination: Shobha, Priyanka and Prince Yawar Danger Zone in 14th Week

ఆ ముగ్గురు డేంజర్‌లో:ఏడో సీజన్‌లో 14వ వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో బిగ్ బాస్ వర్గాల నుంచి తాజాగా సమాచారం లీకైంది. అంతా అనుకున్నట్లుగానే టాప్ 3లోకి అమర్‌దీప్ రావడంతో ప్రిన్స్ యావర్ నాలుగో స్థానానికి పడిపోయాడు. దీంతో అతడు కూడా ఈ వారం డేంజర్ జోన్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ఉన్న ప్రియాంక జైన్, శోభా శెట్టి కూడా ఈ వారం ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నారు.

అతడినే పంపే ఛాన్స్:14 వారం ఓటింగ్‌లో ఇప్పుడు అంబటి కూడా చివరి స్థానంలోనే ఉన్నాడు. కానీ, అతడు నామినేషన్స్‌లో లేకపోవడంతో ఎలిమినేషన్ అయ్యే అవకాశం లేదు. ఇక, ఈ వారంలో ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్లను సేఫ్ చేసి ప్రిన్స్ యావర్‌ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఫినాలే ముందు శివాజి బ్యాచ్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X