Bigg Boss 7 Voting: బిగ్ బాస్ విన్నర్ అతడే.. దిమ్మతిరిగేలా ఓటింగ్.. ఆ టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్!
ఎప్పటికప్పుడు ఊహించని టాస్కులు ఇస్తూ.. ప్రేక్షకులకు మజాను పంచుతూ.. సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్న షోనే బిగ్ బాస్. అసలు పరిచయమే లేని కంటెంట్‌తో వచ్చినా..చాలా తక్కువ సమయంలోనే ఆడియెన్స్ దిల్ ఖుషీ చేసి టాప్ ప్లేస్‌కు చేరింది. అప్పటి నుంచి నిర్వహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని రసవత్తరంగా నడుపుతున్నారు. ఇక, ఇందులో 13వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఎవరూ ఊహించని విధంగా జరుగుతోంది. ఆ పూర్తి వివరాలు మీరే చూసేయండి మరి!
ఒకలా అనుకుంటే మరోలా
బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వస్తాం అని నిర్వహకులు చెప్పినప్పటి నుంచి దీనిపై ఆసక్తి పెరిగిపోయింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సీజన్‌ను నడుపుతున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు ఒకలా అనుకుంటే.. వీళ్లు మరోలా కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్ ఎన్నో మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగిపోతోంది.

ఎలిమినేట్ అయిన వాళ్లు
ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని పావని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతికలు బయటకు వెళ్లారు.
ఈ సారి లిస్ట్‌లో ఏడుగురు
తాజాగా ప్రసారం అవుతోన్న సీజన్‌లో నామినేషన్ ప్రక్రియలు అన్నీ ఎంతో కొత్తగా, ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి వారంలోనూ ఎన్నో రకాల గొడవలు జరుగుతోన్నాయి. అందుకు తగ్గట్లే 13వ వారం ప్రక్రియ మస్త్ మజాగా సాగింది. ఈ టాస్కులో మొత్తంగా శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు.
ఓటింగ్ మాత్రం షాకింగ్
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 13వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ షాకింగ్‌గా సాగుతోంది. ఈ సారి నామినేషన్స్‌లో ఉన్న వాళ్లందరూ టైటిల్ ఫేవరెట్లు కావడంతో పోలింగ్ భారీగా సాగుతున్నట్లు తెలిసింది. అందురూ అనుకున్నట్లు ఈ సారి శివాజి, పల్లవి ప్రశాంత్ మధ్య పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే వీళ్లిద్దరే టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు.
టాప్‌లో అతడే.. విన్నర్
ఎంతో ముఖ్యమైన 13వ వారం ఓటింగ్‌లో మొదట్లో శివాజి టాప్‌లో కొనసాగాడు. అయితే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అతడికి గట్టి పోటీని ఇవ్వడంతో పాటు రెండో రోజు నుంచి మొదటి స్థానానికి వచ్చేశాడు. ఫలితంగా ఇప్పుడు బిగ్ బాస్ పోలింగ్‌లో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఇదే కంటిన్యూ అయితే ఈ సీజన్‌లో అతడే విన్నర్‌గా నిలిచే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు.

మిగిలిన స్థానాల్లో ఎవరు?
13వ వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్ టాప్ పొజిషన్‌లో కొనసాగుతూ ఉండగా.. అతడి తర్వాత శివాజినే ఉన్నాడు. ఆ తర్వాత మాత్రం SPY మెంబర్ ప్రిన్స్ యావర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఉన్న వాళ్ల మధ్యన ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడైతే నాలుగో స్థానంలో అంబటి అర్జున్ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్ట్రాంగ్ ప్లేయర్ ఎలిమినేట్
13వ వారానికి గానూ ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో ప్రియాంక జైన్ ఐదో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. అలాగే, ఆరో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఏడో స్థానంలో శోభా శెట్టిలు ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. అయితే, శోభాను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తోన్న బిగ్ బాస్.. ఈ సారి గౌతమ్‌ను ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











