Bigg Boss 7 Voting: 11వ వారం దిమ్మతిరిగే ఓటింగ్.. వీక్ ప్లేయర్లు టాప్‌లో.. వాళ్లేమో డేంజర్ జోన్‌లో!
అసలేమాత్రం ఊహించని కాన్సెప్టుతో తెలుగులోకి ప్రవేశించిన షో బిగ్ బాస్. కానీ, ఆరంభం నుంచే ఇది వినూత్నంగా సాగుతూ అందరికీ ఆకట్టుకుంది. ఫలితంగా భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని సత్తా చాటింది. ఇలా ఇప్పటికే పలు సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇవన్నీ ఒక దానికి మించి ఒకటి రేటింగ్‌ను రాబట్టాయి. ఈ జోష్‌లోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో సీజన్‌ను కొత్తగా నడుపుతున్నారు. ఇప్పుడు 11వ వారం ఓటింగ్‌పై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఏ కంటెస్టెంట్ ఏ పొజిషన్‌లో ఉన్నారో ఓసారి చూద్దాం పదండి మరి!
అంచనాలకు అందట్లేదుగా:ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్ అనుకున్నట్లుగానే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఉల్టా పుల్టాగా సాగుతోన్న ఈ సీజన్‌లో ఎన్నడూ చూడని ఎన్నో అంశాలను ప్రసారం చేస్తున్నారు. ఫలితంగా పాత సీజన్ల కంటే మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా మారి మజాను పంచుతోంది.

ఎలిమినేట్ అయింది వీళ్లే:ఈ సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారంలో భోలేలు ఎలిమినేట్ అయ్యారు.
ఈ సారి లిస్టులో ఎనిమిది:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో నామినేషన్ ప్రక్రియలు అన్నీ ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతి వారంలోనూ ఎన్నో రకాల గొడవలు జరుగుతూ మజా ఇస్తున్నాయి. అందుకు తగ్గట్లే 11వ వారం ప్రక్రియ చాలా రంజుగా సాగింది. ఈ టాస్కులో మొత్తంగా శోభా శెట్టి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు.

ఫుల్ ఓటింగ్.. ప్రిన్స్ టాప్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 11వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఊహించని విధంగా సాగుతోంది. ఈ సారి నామినేషన్స్‌లో ఎక్కువ మందే ఉండడంతో పోలింగ్ భారీగా జరుగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ప్రిన్స్ యావర్‌కే ఈ వారంలో ఎక్కువ ఓటింగ్ నమోదు అవుతోంది. శివాజి, ప్రశాంత్ నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల ఫ్యాన్స్ అతడే ఓట్లు నొక్కేస్తున్నారని తెలుస్తోంది.
మిగిలిన స్థానాల్లో ఎవరు?:11వ వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ టాప్ పొజిషన్‌లో కొనసాగుతూ ఉండగా.. మిగిలిన అన్ని స్థానాల్లోనూ ఎన్నో రకాల మార్పులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం మాత్రం రెండో స్థానంలో అమర్‌దీప్ చౌదరి ఉన్నట్లు తెలిసింది. వీక్ కంటెస్టెంట్లుగా అనుకున్న రతికా రోజ్ మూడో స్థానంలో, అశ్విని నాలుగో స్థానంలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

స్ట్రాంగ్ ప్లేయర్లు కిందకు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని 11వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో స్ట్రాంగ్ ప్లేయర్లుగా భావిస్తున్న గౌతమ్ కృష్ణ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడని తెలిసింది. అలాగే, మరో బలమైన కంటెస్టెంట్ అంబటి అర్జున్ ఆరో స్థానంలో ఉన్నాడని సమాచారం. అయితే, రాను రానూ వీళ్లిద్దరికి ఓటింగ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే గౌతమ్, అర్జున్ స్థానాలు మెరుగుపడే చాన్స్ ఉంది.
వాళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో:11వ వారానికి గానూ ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో ప్రియాంక జైన్ ఏడో స్థానంలో, శోభా శెట్టి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంటే ఇప్పటికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే, ఓటింగ్ మొదలై ఒక్కరోజే అయింది కాబట్టి.. వీళ్ల స్థానాలు మెరుగుపడే ఛాన్స్ ఉంది. మొత్తానికి 11వ వారం ఎలిమినేషన్ ఎంతో ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











