Bigg Boss 7 Voting: 13వ వారం ఓటింగ్‌లో ట్విస్ట్.. ఆ ఇద్దరికీ తగ్గిన ఓట్లు.. ఎలిమినేట్ మాత్రం అతడే!
సెన్సేషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుంటూ సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ షోగా హవాను చూపిస్తోంది బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది దేశంలోనే ఏ షోకూ రాని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా సాగుతోన్న ఈ సీజన్‌లో ఎలిమినేషన్స్ షాకింగ్‌గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 13వ వారంలో ఓటింగ్ ఎలా జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి మరి!

ట్విస్టులతో సాగుతోందిగా: బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రారంభించారు. ఇందులో ఎవరూ ఊహించని కొత్త కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు షాకింగ్ ఎలిమినేషన్లు చూపిస్తున్నారు. దీంతో ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ఈ సీజన్‌కు గతంలో కంటే ఎక్కువ స్పందన రావడంతో రేటింగ్ కూడా లభిస్తోంది.
ఎవరెవరు వెళ్లిపోయారు?: ఈ సీజన్‌లోకి వైల్డ్ కార్డ్‌తో కలిపి 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని పావని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతికలు ఎలిమినేట్ అయ్యారు.
ఏడుగురు నామినేషన్‌లో: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ముఖ్యమైన నామినేషన్ ప్రక్రియలు చాలా వరకూ కొత్తగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రతి వారంలోనూ ఎన్నో రకాల గొడవలు కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే 13వ వారం ప్రక్రియ రచ్చ రచ్చగా సాగింది. ఈ టాస్కులో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణలు నామినేషన్‌లోకి వచ్చారు.
చాలా భిన్నమైన ఓటింగ్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 13వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎంతో భిన్నంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఫినాలేకు ముందు వచ్చే వారం కావడంతో పాటు ఈ సారి నామినేషన్స్‌లో ఎక్కువగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండడంతో పోలింగ్ భారీగా సాగుతోంది. అందురూ అనుకున్నట్లు ఈ సారి శివాజి, పల్లవి ప్రశాంత్ మధ్యనే టాప్ ప్లేస్ కోసం పోటీ జరుగుతున్నట్లు తెలిసింది.
టాప్ శిష్యుడు, గురువేమో: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 13వ వారం ఓటింగ్‌లో మొదట్లో శివాజి టాప్‌లో కొనసాగాడు. అయితే రెండో రోజు నుంచి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అతడికి గట్టి పోటీని ఇస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, రెండో రోజు నుంచే ప్రశాంత్ టాప్ ప్లేస్‌లో ఉంటున్నట్లు తెలిసింది. ఇదే ఊపు ఫినాలే వీక్‌లో కూడా వస్తే అతడే ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు.

3 ఫిక్స్.. నాలుగులో తేడా: ఈ సీజన్‌లో 13వ వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో బిగ్ బాస్ వర్గాల నుంచి లీకైన సమాచారం ప్రకారం.. పల్లవి ప్రశాంత్ టాప్ పొజిషన్‌లో కొనసాగుతూ ఉండగా.. అతడి తర్వాత శివాజినే ఉన్నాడు. వీళ్ల బ్యాచ్‌కే చెందిన ప్రిన్స్ యావర్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఉన్న వాళ్ల మధ్యన ఓట్ల శాతం చాలా తక్కువగా ఉండడంతో మార్పులు వస్తున్నాయి.

వాళ్లకే తక్కువ వచ్చినా: ఈ వారం ఓటింగ్‌లో ఇప్పుడు అంబటి అర్జున్ నాలుగో స్థానంలో, గౌతమ్ కృష్ణ ఐదో స్థానంలో, ప్రియాంక జైన్ ఆరో స్థానంలో, ఏడో స్థానంలో శోభా శెట్టిలు ఉన్నారు. గత ఎపిసోడ్‌లో అమర్‌తో జరిగిన గొడవ కారణంగా ప్రియాంక ఓట్లు పడిపోయాయి. మొత్తానికి ఈ వారంలో ఆమెతో పాటు శోభా డేంజర్ జోన్‌లో ఉన్నారు. కానీ, గౌతమ్ లేదా అర్జున్‌ను ఎలిమినేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











