Bigg Boss 7 Voting: 14వ వారం ఓటింగ్‌లో సంచలనం.. టాప్ కంటెస్టెంట్‌కు 4వ స్థానం.. ఎలిమినేట్ ఎవరంటే!

బిగ్ బాస్... తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా దీన్ని ఇక్కడి ఆడియెన్స్ ఓన్ చేసేసుకున్నారు. అందుకే గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ డూపర్ హిట్ చేసేశారు. ఫలితంగా ఈ షో చాలా సీజన్లను ఒకదానికి మించి ఒకటి భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఏడో దాన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఇందులో చివరి ఎలిమినేషన్‌కు సంబంధించిన ఓటింగ్‌ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. అవి మీకోసమే!

అన్నింటి కంటే సక్సెస్‌గా:ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో గత సీజన్లలో చూపించని ఎన్నో కొత్త అంశాలను ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి విషయంలోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా ట్విస్టులు, షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్ గతంలో వచ్చిన అన్నింటి కంటే సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty and Priyanka Entered into Danger Zone in 14th Week

ఎవరెవరు వెళ్లిపోయారు?:ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతిక, 13వ వారం గౌతమ్ వెళ్లిపోయారు.

నామినేషన్‌లో ఆరుగురు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో నామినేషన్స్ ప్రక్రియను ఎంతో వైవిధ్యంగా జరుపుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ టాస్కుల్లో గతంలో కంటే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. 14వ వారానికి సంబంధించిన ప్రక్రియ అదే మాదిరిగా సాగింది. ఈ టాస్కులో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టిలు నామినేషన్‌లోకి వచ్చారు.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty and Priyanka Entered into Danger Zone in 14th Week

విన్నర్ కోసం ముందుగా:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 14వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం నుంచే ఫినాలే ఓటింగ్ లైన్స్‌ను ఓపెన్ చేశారు. అంటే ప్రేక్షకులు ఎవరినైతే గెలిపించాలని అనుకుంటున్నారో వాళ్లకు ఇప్పటి నుంచే ఓట్లు వేయొచ్చు. ఇందులో అర్జున్ కూడా ఉన్నాడు. కానీ, అతడి ఇప్పటికే ఫినాలేకు చేరడంతో ఈ వారం ఎలిమినేట్ అవడు.

వాళ్లు ముగ్గురు టాప్‌లో:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 14వ వారం ఓటింగ్‌ ప్రతిష్టాత్మకమైనది కావడంతో కంటెస్టెంట్ల అభిమానులు యాక్టివ్ అయిపోయారు. ఇక, ఇందులో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్‌లో ఉన్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, అతడి తర్వాత స్థానంలో శివాజి కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరి తర్వాత అంటే మూడో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నాడని విశ్వసనీయంగా తెలిసింది.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty and Priyanka Entered into Danger Zone in 14th Week

టాప్ ప్లేయర్ నాలుగు:ఏడో సీజన్‌లో 14వ వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో బిగ్ బాస్ వర్గాల నుంచి లీకైన సమాచారం ప్రకారం.. టాప్ ప్లేయర్‌గా పేరొందిన అమర్‌దీప్ చౌదరి నాలుగో స్థానానికి పడిపోయాడని తెలిసింది. అనధికారిక పోలింగ్‌లో సైతం అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. దీంతో రన్నర్‌గా అయినా నిలుస్తాడని భావిస్తున్న అమర్‌దీప్ అభిమానులకు బిగ్ షాక్ తగిలినట్లు అయింది.

డేంజర్ జోన్‌లో ఇద్దరు:14 వారం ఓటింగ్‌లో ఇప్పుడు అంబటి అర్జున్ ఐదో స్థానంలో ఉన్నాడు. కానీ, అతడు నామినేషన్స్‌లో లేకపోవడంతో ఎలిమినేషన్ అయ్యే అవకాశం లేదు. ఇక, ప్రియాంక జైన్ ఆరో స్థానంలో, శోభా శెట్టి ఏడో స్థానంలో కొనసాగుతున్నారు. అంటే ఈ ఇద్దరు లేడీస్‌లోనే ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి ఏదైనా జరగొచ్చు అని చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X