Bigg Boss 7 Voting: 9వ వారం సంచలన ఓటింగ్.. డేంజర్ జోన్‌లో టైటిల్ ఫేవరెట్లు.. టాప్‌లో ఎవరో తెలిస్తే!
బుల్లితెరపైకి అంచనాలు లేకుండానే వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే సంచలనాత్మక షోగా మారిపోయింది బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా ఏడాదికి ఒక సీజన్ చొప్పున ఇప్పటికే ఆరింటిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలోనే నిర్వహకులు ఇప్పుడు ఏడో దాన్ని ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నారు. ఇందులో తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా మొదలైంది. మరి మొదటి రోజు పూర్తయ్యే సరికి ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో చూద్దాం పదండి మరి!

విభిన్నమైన కంటెంట్‌తోనే: బిగ్ బాస్ షో ప్రసారం అవుతుంది అంటేనే ఆ సీజన్‌పై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఏడో దానిపై విపరీతమైన హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో ట్విస్టులు, షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు వంటివి చూపిస్తున్నారు. దీంతో ఈ సీజన్ రంజుగా సాగుతోంది. తద్వారా రేటింగ్‌ను కూడా రాబట్టుకుంటోంది.
వాళ్లు ఏడుగురు... ఒకరేమో: భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్‌లు వెళ్లిపోయారు.
9వ వారంలోనూ 8 మంది: ఏడో సీజన్ తొమ్మిదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ స్నేక్ కాన్సెప్టుతో జరిగింది. ఇందులో పలువురు కంటెస్టెంట్ల మధ్య ఎన్నో గొడవలు కనిపించాయి. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ టాస్కులో ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో భోలే షావలి, ప్రిన్స్, రతికా రోజ్, అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, అర్జున్‌లు ఉన్నారు.
సంచలన ఓట్స్.. టాప్‌లో: తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి 10.30 గంటల నుంచి ప్రారంభం అయింది. ఇందులో మొదటి నుంచే ఊహించని విధంగానే సాగుతోంది. ముఖ్యంగా ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్‌గా మారిపోయిన ప్రిన్స్ యావర్‌కు ప్రేక్షకులు అదిరిపోయే ఓటింగ్ నమోదు చేస్తున్నారు. దీంతో అతడి ఒక్కడికే 20 శాతం వరకూ పోలింగ్ వస్తున్నట్లు తెలిసింది.

తర్వాతి స్థానాల్లో ఎవరు?: ఏడో సీజన్ తొమ్మిదో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ తర్వాత అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు కూడా తెలిసింది. అయితే వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం ఎన్నో రకాల మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పుడు మూడో స్థానంలో భోలే షావలి, నాలుగో స్థానంలో రతికా రోజ్, ఐదో స్థానంలో అంబటి అర్జున్‌లు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.

డేంజర్ జోన్‌లో టాపర్లు: తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో టేస్టీ తేజ ఆరో స్థానానికి పడిపోయాడని తెలిసింది. అలాగే, ప్రియాంక జైన్ ఏడో స్థానంలో, శోభా శెట్టి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి వీళ్లిద్దరే డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పాలి. వాస్తవానికి భోలే అందరి కంటే చివర్లో ఉంటాడని అనుకున్నా.. అతడికి ఊహించని విధంగా భారీ ఓటింగ్ నమోదు అవుతున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











