Bigg Boss 7 Voting: 9వ వారం ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లోకి మరొకరు.. వీళ్లలోనే ఒకరు ఔట్
ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ప్రేక్షకుల ఆదరణను అందుకుని రికార్డుల మీద రికార్డులు కొడుతూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్‌బాస్. కాన్సెప్టు విషయంలో విమర్శలు వచ్చినా.. మన ప్రేక్షకుల మద్దతుతో దేశంలోనే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోన్న షోగా నిలుస్తోంది. ఇక, ఇప్పుడు ఏడో సీజన్ కూడా అదే రీతిలో రన్ అవుతోంది. ఇందులో తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్ కనిపించింది. దీంతో మరొకరు డేంజర్ జోన్‌లోకి వచ్చారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీరే చూడండి!
అనుకోని విధంగా సాగుతూ:బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా సరికొత్త కంటెంట్‌తో వస్తున్నారు. ఈసారి గత వాటికి భిన్నంగా ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఏడో సీజన్‌ను తీసుకు వచ్చారు. ఇందులో ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ప్రతి దాన్నీ కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌కు గతంలో కంటే మంచి స్పందన వస్తోంది. అందుకు తగ్గట్లుగానే రేటింగ్ కూడా లభిస్తోంది.

ఎలిమినేట్ అయింది వీళ్లే:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ముందుగా 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా, ఎనిమిదో వారం సందీప్‌లు ఎలిమినేట్ అయిపోయారు.
ఈసారి 8 మంది నామినేట్:తాజాగా ప్రసారం అవుతోన్న సీజన్‌లో నామినేషన్లు అన్నీ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. దీనికి కారణం వీటిలో ఎక్కువ గొడవలు జరుగుతుండడమే. అందుకు తగ్గట్లే తొమ్మిదో వారం ప్రక్రియ కూడా కంటెసెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలతో సాగిపోయింది. ఇక, ఇందులో భోలే, ప్రిన్స్, రతికా రోజ్, అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, అర్జున్‌లు నామినేట్ అయ్యారు.

ఓటింగ్‌లో ట్విస్ట్.. టాప్‌లో:ఏడో సీజన్‌లో తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి 10.30 గంటల నుంచి మొదలైంది. ఇందులో ఓటింగ్ సరళి విభిన్నంగా సాగుతోంది. మొదటి రెండు రోజులు ప్రిన్స్ యావర్‌కు అత్యధిక ఓట్లు లభించడంతో టాప్‌లో ఉన్నాడు. కానీ, ప్రస్తుతం మాత్రం అమర్‌దీప్ చౌదరి మొదటి స్థానానికి వచ్చేసినట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.
ఎవరు ఏ స్థానంలో అంటే:ఈ ఓటింగ్‌లో అమర్‌దీప్ చౌదరి టాప్ పొజిషన్‌లో కొనసాగుతూ ఉండగా.. ప్రిన్స్ యావర్ రెండో స్థానంలో ఉన్నట్లు కూడా తెలిసింది. ఇక, వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం ఎన్నో రకాల మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, ప్రస్తుతానికి మాత్రం మూడో స్థానంలో భోలే షావలి, నాలుగో స్థానంలో అంబటి అర్జున్, ఐదో స్థానంలో ప్రియాంక జైన్‌లు ఉన్నారని తెలిసింది.

ఆమె కూడా డేంజర్ జోన్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో టేస్టీ తేజ మొదటి నుంచీ ఆరో స్థానంలోనే కొనసాగుతున్నాడు. అయితే, ఊహించని విధంగా ఈ వీక్ స్టార్టింగ్‌లో డీసెంట్ ఓటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్న రతికా రోజ్ ఇప్పుడు ఏకంగా ఏడో స్థానానికి పడిపోయిందని తెలిసింది. ఆమె తర్వాత అంటే చిట్ట చివరి స్థానంలో శోభా శెట్టి కొనసాగుతుందని సమాచారం.
ఈ ముగ్గురిలోనే ఒకరని:ఇప్పటి వరకూ చూసిన ఓటింగ్ సరళి ప్రకారం.. తొమ్మిదో వారంలో శోభా శెట్టి, రతికా రోజ్, టేస్టీ తేజలు తక్కువ ఓట్లు అందుకుంటూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అంటే ఈ ముగ్గురిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఎలిమినేషన్ సమయానికి ఏమైనా జరగొచ్చు. కాబట్టి దీనిపై అందరిలోనూ ఆసక్తి భారీగా నెలకొంది.


Click it and Unblock the Notifications











