Bigg Boss Voting: ఒక్కసారిగా ఓటింగ్ తారుమారు.. టాప్ కంటెస్టెంట్ చివరికి.. ఈ ట్విస్ట్ ఊహించి ఉండరు!

దాదాపు పదిహేడేళ్ల క్రితమే హిందీలోకి వచ్చి.. ఆ తర్వాత తెలుగుతో సహా చాలా భాషల్లో పరిచయమైన షో బిగ్ బాస్. కానీ, ఏదీ సక్సెస్ కాని విధంగా మన దగ్గర మాత్రమే ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌తో ముందుకు వచ్చారు. ఇది ఆరంభం నుంచే ఊహించని విధంగా సాగుతూ వినోదాన్ని పంచుతోంది. ఇక, రెండో వారం ఎలిమినేషన్ కోసం జరుగుతున్న ఓటింగ్ కూడా ట్విస్టులతో సాగుతోంది. మరి ఈ సారి డేంజర్ జోన్‌లో ఎవరెవరు ఉన్నారో మీరే చూసేయండి మరి!

అదిరిపోయే రేటింగ్‌తో స్టార్ట్:దేశంలోనే చాలా భాషల్లో వస్తున్నా తెలుగులో విశేషమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని దూసుకుపోతన్న బిగ్ బాస్ షో.. ఇప్పటికే భారీ స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో పలు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నిర్వహకులు ఇటీవలే ఏడో దాన్ని కూడా మొదలెట్టారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రీమియర్ ఎపిసోడ్‌కు భారీ రేటింగ్ వచ్చింది.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty and Shakeela Entered into Danger Zone 2nd Week

14 మంది.. ఆమె బయటకు:తాజా సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, నటి శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు వచ్చారు. వీరిలో కిరణ్ రాథోడ్ బయటకు వెళ్లింది.

2వ వారంలో 9 మందికి షాక్:ఏడో సీజన్‌లోని రెండో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎన్నో గొడవలతో రసవత్తరంగా సాగింది. చివరికి ఇందులో 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజి, అమర్‌దీప్‌లు నామినేట్ అయ్యారు. అయితే, ప్రిన్స్ యావర్‌ను మాత్రం పవర్ అస్త్ర ఉన్న సందీప్ నామినేట్ చేశాడు.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty and Shakeela Entered into Danger Zone 2nd Week

అతడే టాప్‌లో ఉన్నాడు:బిగ్ బాస్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ చాలా ట్విస్టులతో సాగుతున్నట్లు తెలిసింది. అయితే, ఇందులో మొదటి నుంచి మాత్రం కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టాప్‌లో కొనసాగతున్నాడు. నామినేషన్స్‌లో తొమ్మిది మంది ఉన్నా అతడికి మాత్రం ఏకంగా 39 శాతం వరకూ ఓటింగ్ నమోదు అవుతుంది. దీంతో ఈ వారం కూడా అతడు దాదాపుగా సేఫ్ అయినట్లే.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty and Shakeela Entered into Danger Zone 2nd Week

ఎవరు ఏ స్థానంలో అంటే:బిగ్ బాస్ ఏడో సీజన్ రెండో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ తర్వాత శివాజి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరి తర్వాత స్థానాల్లో మాత్రం మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ వర్గాల తాజా సమాచారం ప్రకారం అయితే.. అమర్ మూడో స్థానంలో, రతిక నాలుగో స్థానంలో, టేస్టీ తేజ ఐదో స్థానంలో, గౌతమ్ కృష్ణ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిసింది.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty and Shakeela Entered into Danger Zone 2nd Week

డేంజర్‌ జోన్‌లో ఎవరంటే?:రెండో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ఊహించని విధంగా ప్రిన్స్ యావర్ ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. టాప్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి మాత్రం ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఫలితంగా షకీలా అందరి కంటే చివర్లో 9వ స్థానానికి డౌన్ అయిపోయింది. అయితే, ఓటింగ్‌కు ఇంకో రోజు ఉండడంతో ఈ స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X