Bigg Boss Telugu 7: 14వ వారం దిమ్మతిరిగే ఎలిమినేషన్.. వీకెండ్‌లో ఒకరు.. మిడ్ వీక్‌లో మరొకరు ఎలిమినేట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. చివరి అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ షో ముగియనుందని తెలుస్తోంది. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు.. ఎవరు టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలువనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక 14వ వారానికి సంబంధించిన అఫీషియల్ ఓటింగ్ లీక్ అయింది. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. అయితే ఈసారి సీజన్ కొత్తగా ఉంటుందని చెప్పినప్పటి నుంచే భారీగా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎవరూ ఊహించిన విధంగా నడుపుతున్నారు నిర్వహకులు. ముఖ్యంగా ఇందులో గత సీజన్లలో కంటే ఎంటర్ టైన్మెంట్ రెట్టింపు ఉందనే చెప్పాలి. ఇందుకోసం ట్విస్టులు, షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇస్తూ... ప్రేక్షకులకు థ్రిల్ ఫీల్ కలిగిస్తున్నారు. దీంతో ఈ ఉల్టా పుల్టా సీజన్ గత సీజన్ల కంటే ఎక్కువ టీఆర్పీ తెచ్చుకుంటుంది.

ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరిలో మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడవ వారం సింగర్ దామిని, నాలుగవ వారం రతికా రోజ్, ఐదవ వారంలో శుభశ్రీ రాయగురు, ఆరవ వారంలో నయని పవని, ఏడవ వారంలో పూజా మూర్తి, ఎనిమిదవ వారంలో ఆట సందీప్, తొమ్మిదోవ వారంలో టేస్టీ తేజ, పదో వారం భోలే షవాలి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక పదకొండవ వారం ఎలిమినేషన్ లేకపోగా... పన్నేండోవ వారం అశ్విని శ్రీ, రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక గతవారం పదమూడవ వారం గౌతమ్ కృష్ణ హౌస్ నుంచి నిష్క్రమించాడు.

బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో చివరి అంకానికి చేరుకుంది. ఇక 14వ వారం నామినేషన్స్ కూడా ఘాటుగానే సాగింది. ఈ సీజన్‌లో గత సీజన్స్ కంటే ఎక్కువగా గొడవలు జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తుంది. 14వ వారం నామినేషన్స్ లో ఒక్క అర్జున్ అంబటి తప్ప మిగతా సభ్యులు అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్, యావర్, ప్రియాంక, శోభా శెట్టిలు అందరూ నామినేట్ అయ్యారు. అర్జున్ అంబటి ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో ఈ వారం అతను నామినేషన్స్ లోకి రాలేదు.

బిగ్ బాస్ షోలో విన్నర్ డిసైడ్ చేసే ఓటింగ్ చివరి వారం అయిన 15వ వారంలోనే ప్రారంభం అవుతుంది. కానీ బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా కాబట్టి... ముందుగానే 14వ వారం నుంచే స్టార్ట్ చేశారు. ఇందులో డేంజర్ జోన్‌లో ఉన్న వాళ్లు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. మిగిలిన వాళ్లు మాత్రం ఫినాలేకు చేరుకుంటారని సమాచారం. అందుకే ఫైనల్ అస్త్ర గెలిచిన అర్జున్‌ను కూడా ఓటింగ్‌లో చేర్చారు బిగ్ బాస్ నిర్వహకులు.


మూడో స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. అమర్ దీప్ విన్నర్ రేసులో దూసుకుపోతున్న సమయంలో హౌస్ లో చేసిన మిస్టేక్స్ వల్ల నెగిటివిటీ వచ్చేసింది. దీంతో ఆయన ఓటింగ్ పడిపోయిందనే చెప్పాలి. ఇక నాలుగవ స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నాడని సమాచారం. ఇక ఆరో స్థానంలో అర్జున్ అంబటి, ఏడవ స్థానంలో ప్రియాంక జైన్ నిలిచారు. ఇక చివరి స్థానంలో డేంజర్ జోన్ లో శోభా శెట్టి ఉందని తెలుస్తోంది.
14 వారం ఎలిమినేషన్ పక్కగా శోభా శెట్టి అవుతుందని తెలుస్తోంది. ఈసారి సేవ్ చేసేందుకు బిగ్ బాస్ కు అవకాశం లేదని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో శోభాశెట్టి ఎలిమినేట్ అవుందని.. మిడ్ వీక్ లో యావర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











