Bigg Boss Elimination: 8వ వారం సంచలన ఎలిమినేషన్.. ఇద్దరి జర్నీ వీడియోలు రెడీ.. టాప్ కంటెస్టెంటే ఔట్!

తెలుగు బుల్లితెరపై వచ్చే షోనే అయినా.. దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది బిగ్ బాస్. ఏమాత్రం పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చినా.. ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందనను ఇచ్చారు. ఫలితంగా ఇది బిగ్ సక్సెస్ అయింది.

దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను ఎన్నో అంచనాలతో మొదలెట్టి ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇందులో ఎలిమినేషన్స్ షాకింగ్‌గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ వారం ఎలిమినేషన్‌పై తాజాగా న్యూస్ లీకైంది. వివరాల్లోకి వెళ్తే..

Bigg Boss Telugu 7 Elimination

చిత్ర విచిత్రంగా.. ఫుల్ మజా: ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన ఏడో సీజన్ మొదటి నుంచే మంచి స్పందనను అందుకుంటోంది. ఇందులో చిత్ర విచిత్రమైన అంశాలను చూపించడంతో పాటు అప్పుడప్పుడూ షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌ ఎవరూ ఊహించని రీతిలో సాగుతోంది. దీంతో రేటింగ్ కూడా భారీగానే లభిస్తోంది.

ఏడు వారాల్లోనూ వాళ్లే ఔట్: ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా, ఐదో వారంలో శుభశ్రీలు ఎలిమినేట్ అయ్యారు. అలాగే, ఐదు వారాలు ముగిసిన తర్వాత మరో ఐదుగురు సెలెబ్రిటీలు ఎంటరయ్యారు. వీరి నుంచి ఆరో వారం నయనీ, ఏడో వారం పూజాలు వెళ్లిపోయారు.

8వ వారం 8 మంది ఎంట్రీ: బిగ్ బాస్ తాజా సీజన్‌లో ఎలిమినేషన్లు అన్నీ ఊహించని విధంగా సాగుతున్నాయి. ఇందులో ఎక్కువగా లేడీ కంటెస్టెంట్లే వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో 8వ వారం జరిగిన నామినేషన్స్ టాస్కులో గతంలో ఎన్నడూ లేని విధంగా గొడవలు జరిగాయి. మొత్తంగా ఈ వారం భోలే షావలి, అశ్విని శ్రీ, శివాజి, అమర్‌దీప్, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌లు ఉన్నారు.

సగం ఓట్లతో అతడే టాప్‌: బిగ్ బాస్ ఎనిమిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఏకపక్షంగా సాగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారంలో టైటిల్ ఫేవరెట్ అయిన శివాజికి భారీ ఓటింగ్‌ను నమోదు చేసుకున్నాడు. అతడు ఒక్కడికే దాదాపు 47 శాతం ఓటింగ్ వచ్చింది. అయితే, ఆ తర్వాత స్థానాల్లో మాత్రం మొదటి రోజు నుంచీ ఎన్నో మార్పులు చాలానే కనిపించాయని చెప్పుకోవాలి.

ఎవరు ఏ స్థానంలో అంటే: ఎనిమిదో వారానికి గానూ జరిగిన ఓటింగ్‌ ప్రక్రియ ముగిసే సమయానికి పల్లవి శివాజి తర్వాత అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో నిలిచినట్లు తెలిసింది. వీళ్లిద్దరి తర్వాత కంటెస్టెంట్ల స్థానాల్లో చాలా మార్పులే ఉన్నాయని తెలిసింది. అంటే మూడో స్థానంలో గౌతమ్ కృష్ణ, నాలుగో స్థానంలో భోలే షావలి, ఐదో స్థానంలో ప్రియాంక జైన్‌లు ఉన్నారని బిగ్ బాస్ వర్గాల సమాచారం.

Shobha Shetty or Aata Sandeep Eliminate in 8th Week

ముగ్గురు డేంజర్ జోన్‌లో: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చిన సందీప్ మాస్టర్‌కు అందరి కంటే తక్కువ ఓట్లు నమోదు అయినట్లు తెలిసింది. అయితే, ఈ వారం వరస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన శోభా శెట్టి చివరి రోజు ఓట్లలో లాస్ట్ ప్లేస్‌కు పడిపోయిందట. అంటే వీళ్లిద్దరూ ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఉన్నారు. వీళ్ల కంటే ముందు అంటే ఆరో స్థానంలో అశ్విని శ్రీ ఉందని తాజాగా తెలిసింది.

Shobha Shetty or Aata Sandeep Eliminate in 8th Week

వాళ్లిద్దరి వీడియోలు రెడీ: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎలిమినేషన్స్ అన్నీ ఊహించని విధంగానే సాగుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఎనిమిదో వారంలో టాప్ కంటెస్టెంట్లు అయిన శోభా శెట్టి, సందీప్ మాస్టర్‌లలో ఒకరు బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందని తెలిసింది. అందుకే షో నిర్వహకులు ఇప్పటికే వీళ్లిద్దరి జర్నీ వీడియోలను కూడా రెడీ చేసి ఉంచారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X