Bigg Boss Elimination: 11వ వారం మైండ్ బ్లాక్ ఎలిమినేషన్.. ఆమె వెళ్లాలి కానీ.. ఈ సీజన్‌లో తొలిసారిగా!

ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై చాలా రకాల పరిమితులు ఉండేవి. అందుకే ఓ మూస ధోరణిలోనే షోలు వచ్చేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా షోలు విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్నాయి. అలా కొన్నేళ్ల క్రితం వచ్చిందే బిగ్ బాస్. రావడమే కాదు.. టెలివిజన్ రంగంలో అప్పటి వరకూ ఉన్న బౌండరీలను చెరిపేసి దేశంలోనే నెంబర్ వన్ షోగా మారింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తూ.. ఇప్పుడు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇక, ఇందులో 11వ వారం ఎలిమినేషన్‌ ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసమే!

అనుకున్నది జరగకుండా:బిగ్ బాస్ షో ఆరంభంలో కొత్త కంటెంట్‌తో వచ్చినా.. ఆ తర్వాత అందరికీ అలవాటు అయింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం అయ్యేది. అయితే, ఇప్పుడు నడుస్తున్న ఏడో సీజన్‌ మాత్రం అంచనాలు అందడం లేదు. అనుకున్నది కాకుండా అనకోని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఈ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఫలితంగా రేటింగ్ కూడా భారీగా వస్తోంది.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty or Ashwini or Rathika Will Eliminate in 11th Week

ఎవరెవరు వెళ్లిపోయారు?:ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్‌, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారంలో భోలేలు ఎలిమినేట్ అయిపోయారు.

ఎనిమిది మంది నామినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో నామినేషన్ ప్రక్రియలు పాత కాన్సెప్టులతో నడిచినా.. ఎన్నో రకాల గొడవలతో రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే 11వ వారం ప్రక్రియ చాలా రంజుగా సాగింది. ఈ నామినేషన్స్ టాస్కులో మొత్తంగా శోభా శెట్టి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty or Ashwini or Rathika Will Eliminate in 11th Week

వాళ్లిద్దరి మధ్యనే పోటీగా:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 11వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఊహించని విధంగా సాగింది. ఈ సారి నామినేషన్స్‌లో ఎక్కువ మందే ఉండడంతో పోలింగ్ కూడా విభిన్నంగా సాగినట్లు తెలిసింది. ముఖ్యంగా ప్రిన్స్ యావర్‌కే ఈ వారంలో ఎక్కువ ఓటింగ్ నమోదు అయింది. కానీ, ఒక్కో సందర్భంలో అమర్‌దీప్ అతడిని దాటేసి టాప్‌లోకి వెళ్లినట్లు కూడా న్యూస్ లీకైంది.

ఎవరు ఏ స్థానంలో అంటే:ఏడో సీజన్‌లో 11వ వారానికి సంబంధించిన ఓటింగ్ ముగిసే సమయానికి అమర్‌దీప్ చౌదరి టాప్‌ ప్లేస్‌కు చేరుకున్నాడు. దీంతో ప్రిన్స్ యావర్ రెండో స్థానానికి పరిమితం అయినట్లు తెలిసింది. అలాగే, మూడో స్థానంలో అంబటి అర్జున్, నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణలు ఉన్నారని సమాచారం. అంటే ఈ వారంలో ఈ నలుగురు కంటెస్టెంట్లు సేఫ్ అయిపోయారని అర్థం చేసుకోవాలి.

Bigg Boss Telugu 7 Elimination: Shobha Shetty or Ashwini or Rathika Will Eliminate in 11th Week

నలుగురు లేడీస్ డేంజర్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని 11వ వారానికి సంబంధించిన ఓటింగ్‌ కంప్లీట్ అయినప్పటికి నలుగురు లేడీ కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలిసింది. ఈ వారం పోలింగ్ తర్వాత రతికా రోజ్ ఐదో స్థానంలో, ప్రియాంక జైన్ ఆరో స్థానంలో, శోభా శెట్టి ఏడో స్థానంలో, అశ్విని శ్రీ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. అంటే ఈ నలుగురిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

తొలిసారిగా.. మైండ్ బ్లాక్:11వ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌ను పరిశీలిస్తే నలుగురు లేడీస్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతారని అర్థం అవుతోంది. ముఖ్యంగా శోభా శెట్టి లేదా అశ్వినిలో ఒకరు వెళ్లిపోయే అవకాశం ఉంది. అయితే, ప్రిన్స్ యావర్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. దీనివల్ల వేరే కంటెస్టెంట్ కూడా వెళ్లొచ్చని అంటున్నారు. దీంతో ఈసారి ఎలిమినేషన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉండొచ్చని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X